‘వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే బడులు తెరవాలి’

ABN , First Publish Date - 2021-05-18T05:33:36+05:30 IST

ఉపాధ్యాయులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం పూర్తయ్యాకనే పాఠశాలలను తెరవాలని ఏపీఎంటీఎఫ్‌ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్‌కుమార్‌, జంగం బసవరాజు ప్రభుత్వాన్ని కోరారు.

‘వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే బడులు తెరవాలి’

ఆదోని(అగ్రికల్చర్‌), మే 17: ఉపాధ్యాయులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం పూర్తయ్యాకనే పాఠశాలలను తెరవాలని ఏపీఎంటీఎఫ్‌ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్‌కుమార్‌, జంగం బసవరాజు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు కొందరు కొవిడ్‌ బారినపడి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2021-05-18T05:33:36+05:30 IST