కాన్వే సెంచరీ: కివీస్‌ 246/3

ABN , First Publish Date - 2021-06-03T06:21:31+05:30 IST

అరంగేట్ర టెస్ట్‌లో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (136 బ్యాటింగ్‌) సెంచరీతో అదరగొట్టాడు. దాంతో ఇంగ్లండ్‌తో బుధవారం లార్డ్స్‌లో

కాన్వే సెంచరీ: కివీస్‌ 246/3

లండన్‌: అరంగేట్ర టెస్ట్‌లో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (136 బ్యాటింగ్‌) సెంచరీతో అదరగొట్టాడు. దాంతో ఇంగ్లండ్‌తో బుధవారం లార్డ్స్‌లో ప్రారంభమైన తొలి టెస్ట్‌ మొదటి రోజు ఆఖరికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246/3 స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీ్‌సకు ఓపెనర్లు లాథమ్‌ (23), కాన్వే మొదటి వికెట్‌కు 58 పరుగులతో శుభారంభం చేశారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (13), రాస్‌ టేలర్‌ (14) త్వరగా అవుటయ్యారు. అనంతరం డెవాన్‌, హెన్రీ నికోలస్‌ (46 బ్యాటింగ్‌) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 132 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. 

Updated Date - 2021-06-03T06:21:31+05:30 IST