ఫఖర్‌ జమాన్‌ పోరాడినా..

ABN , First Publish Date - 2021-04-05T10:23:22+05:30 IST

లక్ష్యం 342 పరుగులు. భారీ ఛేదనలో సహచరులంతా పెవిలియన్‌ చేరుతున్నా ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (193) అద్భుత పోరాటం చేశాడు.

ఫఖర్‌ జమాన్‌ పోరాడినా..

రెండో వన్డేలో పాకిస్థాన్‌ ఓటమి


జొహాన్నె్‌సబర్గ్‌: లక్ష్యం 342 పరుగులు. భారీ ఛేదనలో సహచరులంతా పెవిలియన్‌ చేరుతున్నా ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (193) అద్భుత పోరాటం చేశాడు. జట్టును దాదాపు విజయం వాకిట దాకా తీసుకొచ్చాడు. ఈ దశలో దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. దాంతో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్‌ 17 పరుగులతో ఓటమిపాలైంది. 50 ఓవర్లలో ఆ జట్టు 324/9 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (31) ఫర్లేదనిపించాడు. కాగావన్డే ఛేదనలో అత్యధిక రన్స్‌ చేసిన బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ (185 నాటౌట్‌) రికార్డును జమాన్‌ బద్దలుగొట్టాడు. అంతకు ముందు సౌతాఫ్రికా 50 ఓవర్లలో 341/6 స్కోరు చేసింది. కెప్టెన్‌ బవుమా (92), డి కాక్‌ (80), డ్యూసెన్‌ (60), మిల్లర్‌ (50 నాటౌట్‌) రాణించారు. ఈ గెలుపుతో ఆతిథ్య జట్టు మూడు వన్డేల సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో పాక్‌ నెగ్గింది. 

Updated Date - 2021-04-05T10:23:22+05:30 IST