ఆపరేషన్‌ 'హిడ్మా'

ABN , First Publish Date - 2021-10-19T05:54:18+05:30 IST

ఆపరేషన్‌ 'హిడ్మా'

ఆపరేషన్‌ 'హిడ్మా'

మావోయిస్టు అగ్రనేత కోసం ముమ్మరంగా కూంబింగ్‌

 మహదేవపూర్‌-ఏటూరునాగారం అడవుల్లోకి ప్రవేశించిన హిడ్మా?

 అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ప్రచారం

 భద్రతా దళాలతో జల్లెడ పడుతున్న  పోలీసులు

 ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులపై  నిఘా

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

మావోయిస్టు నేత హిడ్మా తెలంగాణలోకి ప్రవేశించారనే సమాచారంతో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఇటీవల అనారోగ్యంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ (ఆర్‌కే) మృతి చెందిన విషయం విదితమే. ఆయనపై విష ప్రయోగం జరిగిందనే ప్రచారం ఉంది. ఆర్‌కే మృతికి కారణాలపై ఆరా తీసేందుకు తెలంగాణ ప్రాం తానికి హిడ్మా వచ్చారని తెలుస్తోంది. మరోవైపు  అనా రోగ్యంతో ఉన్న ఆయన వైద్య చికిత్స కోసం సరిహద్దు దాటి వచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌  సరిహద్దు నుంచి ఇంద్రావతి నది పరీవాక ప్రాంతం నుంచి భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోకి మావోయిస్టుల టీంలు ప్రవేశించాయనే ప్రచారం జరుగుతోంది. పలిమెల, మహదేవపూర్‌, మహముత్తా రంతో పాటు ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట అడవు ల్లో హిడ్మా టీం తలదాచుకునే అవకాశం ఉందని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉంటుంది. హిడ్మాతో పాటు కనీసం పాతిక మంది మావోయిస్టులు భూపాలపల్లి, ములుగు జిల్లా లోని గోదావరి తీరం దాటి ఉండొచ్చని పోలీసులు భా విస్తున్నారు. హిడ్మా  వైద్యం కోసం వస్తే ఎక్కడికి వెళ్తా రు.. ఎవరిని కలుస్తారు? అనే అంశంపై పోలీసులు ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని అడవి ప్రాంత ఆర్‌ఎంపీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రులపై పోలీసులు డేగ కన్ను వేశారు. వరంగల్‌, హనుమకొండలోని అన్ని ఆస్పత్రుల వద్ద మఫ్టీ పోలీ సులను పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అనుమాని తులు చికిత్సకు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని   ఆస్పత్రి వర్గాలను పోలీసులు కోరినట్టు తెలుస్తోంది. హిడ్మాకు ఎక్కడ వైద్యం అందుతున్న సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్టు సమాచారం.  అయితే వై ద్యం కోసం కాకుండా ఆర్‌కేపై జరిగినట్టు చెబుతున్న విష ప్రయోగంపై ఆరా తీసేందుకు హిడ్మా వస్తే.. ఎక్క డ, ఎవరిని కలుస్తున్నారని విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టు పార్టీ మహదేవపూ ర్‌-ఏటూరునాగారం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు షెల్టర్‌ ఇచ్చి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. హిడ్మా గోదావరి తీరం దాటారనే ప్రచారంతో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం, వాజే డు, కన్నాయిగూడెం, ఏటూ రునాగారం, మంగపేట, తా డ్వాయి, గోవిందరావుపేట, భూపాలపల్లి జిల్లా పలి మెల, మహదేవపూర్‌, మహముత్తారం, మల్హర్‌, కాటారం, భూపాలపల్లి మండలాల్లో భారీగా తనిఖీ లు చేపట్టారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌, ఏటూరునాగారం, భూపాలపల్లి సీఐలు కిరణ్‌కుమార్‌, వాసుదేవరావు నేతృత్వంలో తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు జిల్లాలోని సరిహద్దు అడవుల్లో సుమారు వెయ్యి మంది స్పెషల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. డ్రోన్ల ద్వారా అడవిని జల్లెడ పడుతున్నట్టు తెలుస్తోంది. అంతరాష్ట్ర రహదారులు ఉన్న ఏటూరునాగారం వద్ద ముళ్లకట్ట బ్రిడ్జి, కాళేశ్వరం వంతెన, మేడిగడ్డ బ్యారేజీ వంతెనల వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నారు.

దండకారణ్యంలో దాడుల సూత్రదారి

ఛత్తీస్‌గఢ్‌ రాష్రంలోని బస్తర్‌ జిల్లా పూవర్తిలోని ఆ దివాసీ కుటుంబంలో జన్మించిన హిడ్మాకు బస్తర్‌, సుక్మా, దంతేవాడ, బీజాపూర్‌ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. దండకారణ్యంలోని ఆదివాసీలతో సత్సంబం ధాలు ఉ న్నాయి. 15ఏళ్ల వయస్సులోనే 1990లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. మిలిటెంట్‌గా పని చేస్తూ బస్తర్‌ కమాండర్‌గా ఎదిగారు. పీపుల్స్‌ లిబరే షన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)లో కీలక నేతగా మారా రు. పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్‌ కమాం డర్‌గా కొనసాగుతున్నారు. మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌  సౌత్‌ సబ్‌ జోనల్‌ కమాండర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడిగా, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మాపని చేస్తున్నారు. 250 మంది మావో యిస్టులకు నేతగా ఉన్న ఆయన్ను పట్టుకునేందుకు  భద్రత దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో రక్తపుటేరులు పారించి న చరిత్ర హిడ్మాది. బస్తర్‌ అడవుల్లో అతిపెద్ద దాడుల కు సూత్రదారి ఆయనే. భద్రత దళాలను తమ ట్రాప్‌ లోకి దింపి దాడికి పాల్పడటంలో దిట్ట. నాలుగంచెల భద్రతతో హిడ్మా సుక్మా జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో తన స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. చాలా ఏళ్లుగా హిడ్మా టార్గెట్‌గా పోలీసులు చేపట్టిన ఆపరేషన్లు విజయ వంతం కాలేదు. దీంతో హిడ్మా పేరు చెబితేనే దండ కారణ్యం వణికి పోతుందనే టాక్‌ ఉంది. 2010లో తడ్‌ మెట్ల మె రుపు దాడిలో 24 మంది జవాన్లు మృతికి ఆయన సూత్రధారి అని తెలుస్తోంది. 2013లో జీరామ్‌ ఘాటి వద్ద కాంగ్రెస్‌ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్రగా పోలీసులు గుర్తించారు. 2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్‌ జవా న్లపై దాడి హతమార్చిన ఘటన భద్రత దళాలకు భారీ ఎదురుదెబ్బగా మిగిలిపోయింది.  2021 ఏప్రిల్‌ 4న బీజాపూర్‌ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కు కుని 22 మంది బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మృతి చెందారు. ఇలాంటి కనీసం 26 దాడుల్లో హిడ్మా కీల కంగా ఉన్నారు. దండకారణ్యంలో మారణహోమం సృష్టించటంతో పాటు పచ్చని అడవుల్లో నెత్తుటేరులు పారిస్తున్న హిడ్మా  భద్రత దళాలకు మోస్ట్‌ వాంటెడ్‌. దండకారణ్యంలో జరిగే ప్రతి దాడి వెనుకా ఆయన హస్తం ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.


Updated Date - 2021-10-19T05:54:18+05:30 IST