ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 గొప్పదని ఒప్పుకుంటారా?
ABN , First Publish Date - 2020-03-03T02:05:11+05:30 IST
తినబోతూ రుచెందుకు? అని అంటారుగానీ.. అది సెల్‌ఫోన్ల విషయంలో ఆ సామెత పనిచేయదు. ఎందుకంటే - ఒక్క ఫోన్ కొనాలంటే ముందు వంద ఫోన్లు రుచి చూడాలి.
తినబోతూ రుచెందుకు? అని అంటారుగానీ.. అది సెల్‌ఫోన్ల విషయంలో ఆ సామెత పనిచేయదు. ఎందుకంటే - ఒక్క ఫోన్ కొనాలంటే ముందు వంద ఫోన్లు రుచి చూడాలి. అదేనండీ - స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి. రేటు అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి. సవాలక్ష వివరాలు కావాలి.
రోజుకి ముప్ఫై ఫోన్లు రిలీజవుతున్న ఈ కాలంలో ఫోన్ గురించని తెలుసుకుంటాం? - అంటున్నారా?
అన్ని ఫోన్స్ గురించీ కాకపోయినా - కొన్ని హై-ఎండ్ ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే! కొన్నా కొనకపోయినా ఆ వివరాలు చూస్తే ఫోన్లలో కొత్త ఫీచర్స్ ఏం వస్తున్నాయో మనకి అర్థమవుతుంది.
మరి అతి త్వరలో రాబోతున్న ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 స్పెసిఫికేషన్స్ ఇవే :
Oppo Find X2
డిస్‌ప్లే 6.7- అంగుళాల శామ్‌సంగ్ OLED Full HD display
స్క్రీన్ రిజల్యూషన్ 3168x1440 పిక్సెల్స్ ( 120Hz రిఫ్రెష్ రేట్ )
ఫ్రంట్ కెమెరా 32-మెగాపిక్సెల్
నాలుగు బ్యాక్ కెమెరాలు 48,48,13 మెగాపిక్సెల్స్ - 5x హైబ్రిడ్ జూమ్
బ్యాటరీ 4260mAh ( 65W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో )
ఆపరేటింగ్ సిస్టమ్ యాండ్రాయిడ్ 10
సరే. ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయి?
ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 గొప్పదని ఒప్పుకుంటారా?
ఫీచర్లు గొప్పవే. కానీ ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 రేటెంతో తెలుసా?
డెబ్భై వేల పై మాటే!
ఆ లెక్కన చూస్తే .. ఇవి అదిరిపోయే ఫీచర్స్ ఏం కాదని చెప్పాల్సి ఉంటుంది.