Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ లక్ష్యం పూర్తి చేయడం కోసం ఆపసోపాలు

కురిచేడు, నవంబరు 27: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లక్ష్యాలను పూర్తి చేయడానికి అధికారులు అపసోపాలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు రూ.10 వేలు కట్టాల్సి రావడంతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. తమ ఇంట్లో తామే ఉండగా, ఇప్పుడు రూ.10 వేలుఎందుకు చెల్లించాలనే ప్రశ్నను ఇంటి యజమానుల ప్రశ్నకు అధికారుల వద్ద నుంచి కూడా సరైన సమాదానం రావడం లేదు. దీంతో మండలంలో ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. మండలంలోని 15 పంచాయతీల పరిధిలో శనివారం ఓటీఎస్‌ మేళా నిర్వహించారు. అఽధికారులు, గ్రామైక్య సంఘాలు వీవోలు, వాలంటీర్లు లబ్దిదారులతో చర్చించి వారిని రిజిస్ట్రేషన్‌కు ఒప్పించేలా ప్రయత్నాలు చేశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఒక్కో పంచాయతీకి లక్ష్యాలను నిర్ణయించి ప్రయత్నాలు చేసినా స్పందన లేదు. కురిచేడు పంచాయతీలో 450 మంది లబ్దిదారులుండగా 11 మంది మాత్రమే ఓటీఎస్‌కు అంగీకరించారు. మండలం మొత్తం మీద కేవలం 49 మంది మాత్రమే ఓటీఎస్‌ పద్ధతిలో చెల్లింపులు చేశారు. లబ్ధిదారులందరూ వచ్చి ఓటియ్‌సకు అనుకూలంగా డబ్బులు కడతారని అధికారులు ఊహించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. వారి ఊహలు అడియాశలు అయ్యాయి.

సీ.ఎ్‌స.పురం : జగనన్న శాశ్వత గృహహక్కు పథకం ద్వారా గృహాల విలువ పెరుగుతుందని డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కట్టా శ్రీనువాసులు తెలిపారు. మండలంలోని ఆర్‌.కే.పల్లి గ్రామంలో శాశ్వత గృహహక్కు పథకంలో ఓటీఎస్‌ ద్వారా నగదు చెల్లించిన లబ్ధిదారులకు శనివారం పత్రాలను అందజేశారు. మొత్తం 1930 మంది లబ్దిదారులు ఉండగా ఇప్పటివరకు 130మంది చేత నగదు కట్టించామన్నారు. అనంతరం మండలంలోని చింతపూడు గ్రామంలో ఓటీఎ్‌సపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ కోటిరెడ్డి, వెలుగు ఏపీఎం రజని, ఈవోపీఆర్డీ జి.వి.అరవిందా పాల్గొన్నారు.

వెలిగండ్ల : గృహహక్కు పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించే బాధ్యత వీఆర్వోలపైన ఉందని తహసీల్దార్‌ జ్వాల నరసింహం అన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. వీఆర్వోలు శివప్రసాదు, కాశయ్య, దయాకరు, పద్మనాభం, రజనీబాబు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఏడుగురు లబ్ధిదారులకు ఓటీఎస్‌ పత్రాలు

 గుడ్లూరు : మండలంలోని మోచర్ల గ్రామంలో ఏడుగురు లబ్ధిదారులకు ఓటీఎస్‌ పత్రాలను హౌసింగ్‌ డీఈ సాధిక్‌ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, హౌసింగ్‌ ఏఈ గౌస్‌ బాషా, పంచాయతీ కార్యదర్శి ఇషా, వీఆర్వో గోపాల్‌ తదితర సిబ్బంది. నాయకులు బిల్లా రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement