ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు అవకాశం

ABN , First Publish Date - 2020-07-02T11:20:11+05:30 IST

నగర కార్పొరేషన్‌, నగర అభివృద్ధి సంస్థలు ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టిపెట్టాయి. నగరంలో విలీన గ్రామాల్లో ఉన్న ప్లాట్లను

ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు అవకాశం

నూడా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో.. 

ఈనెల 4 నుంచి 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన సదస్సులు


నిజామాబాద్‌, జూలై  1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగర కార్పొరేషన్‌, నగర అభివృద్ధి సంస్థలు ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టిపెట్టాయి.  నగరంలో విలీన గ్రామాల్లో ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్లను గుర్తించడంతో పాటు వారికి అ వగాహన కల్పించేందుకు నిర్ణయించారు.  ఆయా గ్రామాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించి వారికి అవగాహన కల్పించడంతో పాటు రెండు సంస్థలకు నిఽధులు వచ్చే వి ధంగా ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులరైజ్‌ చేసుకోని వారందరికీ నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు. రెండు సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. నగర కార్పొరేషన్‌ పరిధిలో విలీనం కాక ముందు శివారు గామాల్లో  ఎక్కువ మొ త్తంలో ప్లాట్ల అమ్మకాలు జరిగాయి. కొన్ని ప్లాట్లు నాలా క న్వర్షన్‌ చేసి అమ్మకాలు చేపట్టగా మరికొన్ని లేఅవుట్‌  లేకుండానే అమ్మకాలు చేశారు. రిజిస్ట్రేషన్‌లు చేసి కొన్న వారికి అప్పగించారు. నగర కార్పొరేషన్‌ పరిధిలో ఆయా గ్రామాల పరిఽధిలో ఈ అమ్మకాలు  ఎక్కువగా జరిగాయి. గ్రామపంచాయతీ స్థాయిలో అనుమతులు తీసుకొని వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి అమ్మారు.


గ్రామపంచాయతీ స్థాయిలో నామమాత్రం ఫీజులు చెల్లించి వీటిని ప్లా ట్లు చేశారు. కొన్నవారు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకొని రెగ్యులరైజేషన్‌ పైన దృష్టి పెట్టలేదు. టౌన్‌ అండ్‌ కం ట్రీ ప్లానింగ్‌ అధికారులు కూడా వీటిని అ ప్పుడు పట్టించుకోలేదు. అప్పుడున్న గ్రామపంచాయతీలు అనుమతులు ఇవ్వ డంతో యథేచ్చగా అమ్మకాలు జరిగాయి. నగర పరిఽధిలో విలీనమైన గ్రామాలు మానిక్‌బండార్‌, బోర్గాం, సారంగాపూర్‌, ముబారక్‌నగర్‌,  గూ పన్‌పల్లి, సారంగాపూర్‌, కాలూర్‌తో పాటు నూడా పరిధిలోని ముప్కాల్‌, అ మ్రాద్‌, బర్దీపూర్‌, నడిపల్లి, జానకంపేట్‌ గ్రామాల్లో సుమారు 62 ఎకరాల పరిధిలో ఈ అనుమతి లేని లేఅవుట్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 4 నుంచి 31 వరకు ఆయా గ్రామాల పరిధి లో అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నారు. మున్సిప ల్‌, నూడా అధికారులతో పాటు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పాల్గొని లేఅవుట్‌ల రెగ్యులరైజేషన్‌పై అవగాహన కల్పించనున్నారు. సెప్టెంబర్‌ వరకు అనుమతి ఉండంతో ఆ లోపు రెగ్యులరైజేషన్‌ చేసుకోవాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ రెగ్యులరైజేషన్‌ ఛార్జీలను వ సూలు చేయనున్నారు.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం వం ద గజాలలోపు భూమికి గజానికి రూ.200 చొప్పున చార్జీని వసూలు చేయనున్నారు. వంద  నుంచి 300 వర కు గజానికి రూ.400చొప్పున రుసుం వసూ లు చేస్తారు. 300నుంచి 500 గజాలకు గ జానికి రూ.600 చొప్పున, 500కు పైన గ జానికి రూ.750 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ మూడు నెలల్లో గుర్తించి న అన్ని లేఅవుట్‌లు రెగ్యులరైజేషన్‌ చేసే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో  రెగ్యులరైజేషన్‌ చేసుకోకుండా కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం చేసుకునేందుకు ఈ అవకాశాన్ని ప్ర భుత్వం ఇవ్వడంతో నిధులు కూడా ఈ రెండు సం స్థలకు రానుండడంలో అధికారులు దృష్టిపెట్టారు. అప్పుడు కొనుగోలు చేసిన వారికి డబ్బులు ఎక్కువ మొత్తంలో కట్టా ల్సి ఉన్నా రెగ్యులరైజ్‌ చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బం దులు రావని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.  నూడా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అధికారులతో కలి సి ఈ ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నూడా చైర్మన్‌ చామకూర ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.  రెగ్యులరైజేషన్‌ అందరూ చేయించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావని ఆయన తెలిపారు. ప్రభుత్వం  ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 

Updated Date - 2020-07-02T11:20:11+05:30 IST