ఆటుపోట్లకు అవకాశం

ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST

త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో పాటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, అంతర్జాతీయ పరిస్థితులు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి.

ఆటుపోట్లకు అవకాశం

త్రైమాసిక  ఆర్థిక ఫలితాలతో పాటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, అంతర్జాతీయ పరిస్థితులు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. మరోవైపు సాధారణ బడ్జెట్‌ సమర్పణ తేదీ దగ్గర పడుతుండటంతో మార్కెట్లు కొంత ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. లాభాల స్వీకరణకు అవకాశాలెక్కువగా ఉన్నాయి. నిఫ్టీకి 14,650 వద్ద నిరోధం ఎదురు కావచ్చు. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను కనబరిస్తే 14,380 స్థాయికి చేరే అవకాశం ఉంది. 


స్టాక్‌ రికమండేషన్స్‌

వొడాఫోన్‌ ఐడియా: ఈ షేరు 18 నెలల అనంతరం నిరోధ స్థాయిలను అధిగమించి గరిష్ఠ స్థాయిల్లో క్జోజైంది. గత శుక్రవారం రూ.13.60 వద్ద క్లోజైన ఈ షేరును రానున్న వారాలకు రూ.18-20 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.10.90 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఐజీఎల్‌: డైలీ చార్టుల ప్రకారం చూస్తే ఈ షేరు ‘షూటింగ్‌ స్టార్‌’ ప్యాట్రన్‌ను సూచిస్తోంది. మొత్తం ట్రెండ్‌ను పరిశీలిస్తే బుల్లి్‌షగా ఉంది. స్వల్పకాలిక కరెక్షన్‌కు అవకాశం ఉంది. గత శుక్రవారం ఈ షేరు రూ.548.85 వద్ద క్లోజైంది. రానున్న వారాలకు ఈ షేరు రూ.560-565 దిశగా సాగితే ట్రేడర్లు రూ.527 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని విక్రయించే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.576 స్థాయిని మాత్రం కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట, టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST