విశాఖ ఉక్కు అమ్మకాన్ని వ్యతిరేకించండి

ABN , First Publish Date - 2021-08-03T07:47:00+05:30 IST

విశాఖ ఉక్కు అమ్మకాన్ని వ్యతిరేకించాలని వ్య.కా.స మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి డిమాండ్‌ చేశారు.

విశాఖ ఉక్కు అమ్మకాన్ని వ్యతిరేకించండి
పామూరులో నిరసన తెలుపుతున్న నాయకులు

పామూరు, ఆగస్టు 2: విశాఖ ఉక్కు అమ్మకాన్ని వ్యతిరేకించాలని వ్య.కా.స మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. స్థానిక మమ్మిడాడీ సెంటర్‌లో సోమవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కారుచౌకగా విదేశీ కంపెనీలకు అమ్మాలని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇందుకు నిరసనగా విశాఖస్టీల్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమాలకు పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. నిరసన కార్యక్రమంలో వార్డు మెంబర్‌ షేక్‌ మస్తాన్‌, సీఐటీయూ అద్యక్షలు అల్లా భక్షు, మహదేవయ్య, డి రామయ్య, షేక్‌ మదార్‌బి, చాంద్‌బాష, వై వీరనారాయణ, ఎం విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గుడ్లూరు : విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని ప్రైవేట్‌ పరంచేస్తే ఉరుకునేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు గంటెనపల్లి వెంకటేశ్వర్లు  పేర్కొన్నారు.  గుడ్లూరు సచివాలయ - 2 కేంద్ర ఎదుట సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహ ంచారు. ఈ సందక్బంగా ఏర్పాటు చేసిన ఆందోళన కార్యక్రమానికి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కుప్యాక్టరీని కారుచౌకగా కార్పోరేట్లకు అమ్మడం అంటే, ఆంధ్రరాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడం తప్ప మరోకటి కాదన్నారు.. మోడీ వచ్చిన తరువాత, దేశ సంక్షేమాన్ని విస్మరించి, కార్పోరేట్ల కొమ్ముకాస్తుందన్నారు. ౅ విశాఖ ఉక్కు ప్రవేట్‌ పరం కాకుండా చూసుకునేందుకు గాను రాష్ట్ర ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకురాళ్లు అంజమ్మ, రాధ, మరియమ్మ, సుబ్బమ్మ, ప్రభావతి,  సిపియం నాయకులు వెంకటేశ్వర్లు, రైతుసంఘం నాయకులు దామకృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాల్యాద్రి, దళిత నాయకులు నేలటూరి తిరుపాలు, నాగేశ్వరరావు, ఖాధర్‌ బాషా, మస్తాన్‌, తధితరులు పాల్గోన్నారు. 

Updated Date - 2021-08-03T07:47:00+05:30 IST