వరదసహాయంలో అక్రమాలపై వ్యాజ్యంలో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-01-19T13:24:22+05:30 IST

గత ఏడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం పంపిణీలో భారీఎత్తున అవకతవకలు జరిగాయని పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు ...

వరదసహాయంలో అక్రమాలపై వ్యాజ్యంలో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి

 జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశం

హైదరాబాద్: గత ఏడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం పంపిణీలో భారీఎత్తున అవకతవకలు జరిగాయని పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ హైకోర్టు సీజేకు రాసిన లేఖను ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులకు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు జనవరి 5న నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. అయితే, ప్రతివాదుల్లో కొందరు కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయకపోవడంతో ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని మరోసారి కోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో స్థాయీ నివేదిక (స్టేటస్‌ రిపోర్టు) ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ ఏ. అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 


సమగ్ర సమాచారం...

సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం జీహెచ్‌ఎంసీ వద్ద ఇప్పటికీ లేదు. దీంతో ఖాళీ స్థలాలు,  ఇతర ఆస్తులు పరాధీనమవుతున్నాయి. మునిసిపల్‌ మార్కెట్లు, వాణిజ్య సముదాయాలను లీజుకు అప్పగించగా, గడువు ఎప్పుడు ముగుస్తుంది..? యేటా ఎంత లీజు చెల్లించాలనే వివరాలూ అధికారుల వద్ద లేవు. దీంతో సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతోంది. రహదారులు, నాలాలు, వీధి దీపాలు, సిగ్నళ్లు ఇతరత్రా సమాచారమూ పూర్తిస్థాయిలో లేదు. 



మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన.. 

సమాచారంతోపాటు నగర విస్తరణాభివృద్ధికి సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపైనా ఈ విభాగం దృష్టి సారిస్తుంది. మాస్టర్‌ ప్లాన్‌లో ఏముంది, క్షేత్రస్థాయిలో పరిస్థితులేంటి అన్నది ప్రత్యక్షంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. రహదారుల విస్తరణ, వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణ సమయంలో ఆస్తుల సేకర ణ ఏ దశలో ఉంది.. వంటి వివరాలను సేకరిస్తారు. డిజిటల్‌ డోర్‌ నెంబర్ల కేటాయింపు, ఆస్తి పన్ను మదింపు, అనుమతి ఉన్న వ్యాపార సంస్థలు, ఇతర సమాచారాన్ని ఈ సెల్‌ అందుబాటులో ఉంచుతుంది.  

Updated Date - 2021-01-19T13:24:22+05:30 IST