ఆరోగ్యమిత్ర తొలగింపునకు ఆదేశాలు

ABN , First Publish Date - 2021-02-28T04:00:21+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరోగ్యమిత్ర రామచంద్రయ్యను తొలగించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ను ఆదేశించారు.

ఆరోగ్యమిత్ర తొలగింపునకు ఆదేశాలు
రోగులతో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు(వైద్యం)ఫిబ్రవరి 27 : విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరోగ్యమిత్ర  రామచంద్రయ్యను  తొలగించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి  ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. శనివారం జేసీ నెల్లూరులోని మెడికవర్‌ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడ ఆరోగ్యశ్రీ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆరోగ్యశ్రీ హెల్ప్‌ డెస్క్‌ వద్ద ఆరోగ్యమిత్ర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డానని ఓ రోగి జేసీ దృష్టికి తెచ్చారు. దీంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఆరోగ్యమిత్రను తొలగించాలని ఆదేశించారు.

Updated Date - 2021-02-28T04:00:21+05:30 IST