రైతులకు బాగు.. సేంద్రియ సాగు!

ABN , First Publish Date - 2021-06-21T05:10:26+05:30 IST

రైతులకు బాగు.. సేంద్రియ సాగు!

రైతులకు బాగు.. సేంద్రియ సాగు!
ఒక దగ్గర జమచేసిన పశువుల ఎరువు

  • దిగుబడి అధికం..  భూసారం పదిలం

చేవెళ్ల: అధిక దిగుబడి కోసం రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతుంటారు. వాటితో పంటల దిగుబడి తగ్గడంతో పాటు భూసారం సైతం క్షీణిస్తుంది. సేంద్రీయ ఎరువైన పశువుల పేడ పంటలకు ప్రయోజనకరమని చేవెళ్ల డివిజన్‌ వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. చేవెళ్ల, షాబాద్‌, మొయినాబాద్‌, శంకర్‌పల్లి మండలాల్లో రైతులు వానకాలం పంటకు సిద్ధమవుతున్న తరుణంలో సేంద్రియ ఎరువులపై దృషి సారించాలంటున్నారు. పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, గొర్రె లు, మేకలు, పందులు, కోళ్ల ఎరువు, వేప పొడి తదితరాలను సేంద్రియ ఎరువుగా వేసుకోవచ్చని వివరిస్తున్నారు. సేంద్రీయ ఎరువుల్లోని పోషకాల శాతాన్ని తెలుసుకుని తగిన మోతాదులో వాడితే రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. భూసారం వృద్ధి చెందుతుంది. పశువుల ఎరువును పొలాల్లో వేసి దు క్కి దున్నుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పే ర్కొంటున్నారు. ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల లోడ్ల పశువుల ఎరువును ఉపయోగించాలని సూచిస్తున్నారు. 


  • పశువుల ఎరువుతో ప్రయోజనాలెన్నో..!


సేంద్రియ ఎరువులతో భూమి గుల్లబారి తేమ నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. మొక్కలకు మేలు చేసే  సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. సేంద్రియ ఎరువులతో నేలలో చౌడు, క్షారం, ఉప్పులవణాలు తగ్గి పంట ఉత్పత్తి పెరుగుతుంది. మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం, బోరాన్‌, మాలిబ్దినమ్‌, జింక్‌ వంటి మృత్తికలు సేంద్రీయ ఎరువుల్లో లభిస్తాయి.

Updated Date - 2021-06-21T05:10:26+05:30 IST