లైసెన్స లేకుండా ఆర్గానిక్‌ ఉత్పత్తులు

ABN , First Publish Date - 2021-10-21T05:03:51+05:30 IST

మండలంలోని లేమల్లెపాడులో ఎటువంటి లైసెన్సులు లేకుండా ఆర్గానిక్‌ పేరుతో ఉత్పత్తులు తయారు చేసి విక్రయించడానికి సిద్ధం చేసిన 400 బస్తాలను బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లైసెన్స లేకుండా ఆర్గానిక్‌ ఉత్పత్తులు
లైసెన్స లేకుండా తయారైన ఆర్గానిక్‌ ఉత్పత్తులు

దాడుల్లో గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు  

వట్టిచెరుకూరు, అక్టోబరు20: మండలంలోని లేమల్లెపాడులో ఎటువంటి లైసెన్సులు లేకుండా ఆర్గానిక్‌ పేరుతో ఉత్పత్తులు తయారు చేసి విక్రయించడానికి సిద్ధం చేసిన 400 బస్తాలను బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన అరవింద్‌ అనే వ్యక్తి షాపు అద్దెకు తీసుకుని కిసాన గ్రో పేరుతో పొడి రూపంలో ఎరువులను తయారు చేశాడు. మిరప పైరుకు బాగా ఉపయోగపడుతుందని ప్రచారం చేశాడు. వీటిని గ్రామంలోని షిరిడీ సాయి కల్యాణమండపం సమీపంలోని ఒక గేదెల చావడిలో నిల్వ చేశారు. గ్రామం సెంటర్‌లో ఓ షాపును అద్దెకు తీసుకొని వివిధ రకాల ఉత్పత్తులను ఉంచాడు. సమాచారం అందుకున్న ఎంఏవో లక్ష్మి తన సిబ్బందితో ఈ నిల్వలపై దాడి చేశారు. లైసెన్స లేని ఆర్గానిక్‌ ఉత్పత్తులను గుర్తించి చేశారు. వీటి విలువ రూ.4 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ దాడుల్లో  ఆర్‌బీకే ఇనఛార్జ్‌ దుర్గానాయక్‌లు తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-21T05:03:51+05:30 IST