రెండో దశ పరీక్షల్లో ఆరిజీన్‌ సొరియాసిస్‌ ఔషధం

ABN , First Publish Date - 2020-02-22T07:09:58+05:30 IST

బయోటెక్నాలజీ కంపెనీ ఆరిజీన్‌ సొరియాసిస్‌ ఔషధ మాలిక్యూల్‌ (మూల కణం) ‘ఏయూఆర్‌101’ పై రెండో దశ వైద్య పరీక్షలు ప్రారంభించింది.

రెండో దశ పరీక్షల్లో ఆరిజీన్‌ సొరియాసిస్‌ ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బయోటెక్నాలజీ కంపెనీ ఆరిజీన్‌ సొరియాసిస్‌ ఔషధ మాలిక్యూల్‌ (మూల కణం) ‘ఏయూఆర్‌101’ పై రెండో దశ వైద్య పరీక్షలు ప్రారంభించింది. కేన్సర్‌, ఇన్‌ఫ్లేమెటరీ వ్యాధులకు ఉత్తమమైన థెరఫీల అభివృద్ధిలో నిమగ్నమైన ఆరిజీన్‌.. డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ కంపెనీ. ఒక స్థాయి నుంచి తీవ్ర స్థాయిలో సొరియాసిస్‌ ఉన్న రోగులపై ఫేస్‌ 2 పరీక్షలు ప్రారంభించామని, సొరియాసిస్‌ ఔషధ అభివృద్ధిలో పురోగతి కంపెనీకి మైలురాయని ఆరిజీన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మురళీ రామచంద్ర తెలిపారు. 2020 చివరినాటికి ముఖ్యమైన క్లినికల్‌ డేటా అందుబాటులోకి రాగలదని ఆ తర్వాత భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు ఉంటాయని తెలిపారు. 

Updated Date - 2020-02-22T07:09:58+05:30 IST