ఆన్‌లైన్‌ తరగతులపై ఓయూ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-16T20:52:20+05:30 IST

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటినుంచి ఈ నెల 30వరకు

ఆన్‌లైన్‌ తరగతులపై ఓయూ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటినుంచి ఈ నెల 30వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో పరీక్షలు రీషెడ్యూల్ విడుదల చేశారు. ఎల్లుండి నుంచి పలు యూనివర్సిటీలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు.


మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-01-16T20:52:20+05:30 IST