Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలి

పరిగి/ఘట్‌కేసర్‌ రూరల్‌ : యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ సూచించారు. గురువారం మండల పరిధిలోని గడిసింగాపూర్‌లోని రైతువేదికలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. డీఏవో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యాసంగిలో వరిపంట సాగు చేయరాదని సూచించారు. వరికి బదులుగా నూనెగింజలు సాగుచేస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు. శనగ, వేరుశనగ, సన్‌ప్లవర్‌, జొన్న పంటలను సాగు చేయాలన్నారు. ఆరుతడి పంటలు సాగుచేయడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి లాభాలు పొందవచ్చన్నారు. రైతులు ప్రభుత్వ ఆదేశాలను, వ్యవసాయాధికారుల సలహాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రాధిక, ఏవో ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ జి.అశోక్‌వర్ధన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోస్టర్‌ ఆవిష్కరణ

యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి రైతులను కోరారు. ప్రతా్‌పసింగారంలో గురువారం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ పాల్గొని మాట్లాడుతూ.. రైతులు వరికి బదులుగా వేరుశనగ, మినుములు, నువ్వులు, పెసర్లు, జొన్న తదితర పంటలను సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వంగూరి శివశంకర్‌, ఏఈవో జగదీష్‌, రైతుబంధు గ్రామ కమిటీ అధ్యక్షుడు సుభా్‌షరెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, నాయకులు జమీల్‌, వినోద్‌రెడ్డి, మహేష్‌, కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement