నిన్న ఓటీఎస్‌.. నేడు ఓటీసీ

ABN , First Publish Date - 2022-01-20T04:59:29+05:30 IST

నిన్న, మొన్నటివరకు ఎప్పుడో నిర్మించిన గృహాలపై ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ పేరుతో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు నాలా పన్ను వసూళ్లపై దృష్టిసారించింది.

నిన్న ఓటీఎస్‌.. నేడు ఓటీసీ

రూ.30 కోట్లు వసూలు చేసేందుకు ప్రయత్నాలు 

అధికారులపై ఒత్తిడి పెంచుతున్న సర్కారు


గుంటూరు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): నిన్న, మొన్నటివరకు ఎప్పుడో నిర్మించిన గృహాలపై ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ పేరుతో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు నాలా పన్ను వసూళ్లపై దృష్టిసారించింది. ఇప్పటివరకు 3 శాతంగా ఉన్న నాలా పన్నుని 5 శాతానికి పెంచడంతో పాటు పెనాల్టీని రెట్టింపు చేసి వసూలు చేయాలని తా జాగా ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా నాలా పన్ను వసూలు చేసేందుకు రెవెన్యూ బృందాలను నియమించేందుకు అధికా రులు ఆలోచన చేస్తున్నారు. ఒన్‌టైం కన్వర్షన్‌ (ఓటీసీ) పేరుతో గుట్టుచప్పుడు కాకుండా దీనిని అమలులోకి తీసుకొచ్చింది. జిల్లాలో దాదాపుగా రూ.30కోట్లకు పైగా వసూలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నారు. 

తీవ్రఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనాసరే ఆదాయం కూడబె ట్టేందుకు ప్రజల నుంచి పన్నుల పేరుతో వసూ లు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దశాబ్ధా ల క్రితం నిర్మించిన ఇళ్లపై ఓటీఎస్‌ పేరుతో గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు,నగరపాలకసంస్థలో రూ.20 వేలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. నగదు చెల్లిస్తే రుణ విముక్తిపత్రంతో పాటు టైటిల్‌డీడ్‌ ఇస్తా మని, దానిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని, అలానే బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవచ్చని చెబుతోంది. కాగా ఇప్పుడు నాలా పన్ను విషయంలో ఒన్‌టైం కన్వర్షన్‌(ఓటీసీ)ని తీసుకొచ్చింది. గతంలో భూమివిలువ ఆధారంగా వ్యవసాయ భూము ల్లో నిర్మించిన కట్టడాలపై పన్నుని వసూలు చేసేవారు. మూడుశాతం వరకు పన్ను ఉం టుంది. దీనిని తాజాగా 5 శాతానికి పెంచింది. అంతేకాకుండా ఎవరైతే అనధికారికంగా నిర్మా ణాలు చేశారో వారి వద్ద 10 శాతం పెనాల్టీని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లాలో ఓటీసీ డిమాండ్‌ని రెవెన్యూ వర్గాలు సిద్ధం చేశాయి. దాదాపుగా రూ.30.36 కోట్లు వసూలు కావాల్సి ఉందని, ఇందులో ఇప్పటివరకు కేవలం రూ.0.81 కోట్లు మాత్రమే వసూలైందని పేర్కొంటున్నాయి. రూ.29.56 కోట్లు వసూలు చేయాలని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. 

పెదకాకానిలో రూ.5.97 కోట్లు, అమరావతిలో రూ. 5.52 కోట్లు, సత్తెన పల్లిలో రూ. 2.62 కోట్లు, తాడేపల్లిలో రూ.2.58 కోట్లు, తెనాలిలో రూ.2.26 కోట్లు, కర్లపాలెంలో రూ.1.36 కోట్లు బకాయి లు ఎక్కువగా పెండిం గ్‌లో ఉన్నాయని ఆ మండలాల తహసీల్దార్లకు లిస్టులు పంపిం చారు. ఇదేవిధంగా మిగతా మండలాల్లోనూ పెండింగ్‌ నాలా పన్నులపై అధికారులను ఒత్తిడి చేయడం ప్రారంభించారు. వీటితో పాటే నీటి తీరువా కూడా భారీగా పెండింగ్‌ పడిందని, దాదాపు రూ.55.14 కోట్లు వసూలు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ రెండు పన్నుల వసూళ్లపై రైతులను ఒత్తిడికి గురి చేసే అవకాశం లేకపోలేదు. 

Updated Date - 2022-01-20T04:59:29+05:30 IST