ఓటీఎస్‌.. సిగ్గుచేటు

ABN , First Publish Date - 2021-12-09T04:49:16+05:30 IST

పేదల గృహ నిర్మాణ పథకంలో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి కంబాల రాజవర్ధన్‌ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఓటీఎస్‌ పేరుతో పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.

ఓటీఎస్‌.. సిగ్గుచేటు
రాజాంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు

రాజాం: పేదల గృహ నిర్మాణ పథకంలో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి కంబాల రాజవర్ధన్‌ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఓటీఎస్‌ పేరుతో పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎడా పెడా అప్పులు చేయడమే కాకుండా వివిధ మార్గాల గుండా వసూలు చేస్తూ అన్ని వర్గాలపైనా భారం వేస్తోందన్నారు. దశాబ్ద కాలం నుంచి ఏ గృహ పథకానికి ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు డోల దేశినాయుడు, జిల్లా కార్యదర్శి కంబాల వంశీవర్ధన్‌,  గణేష్‌. సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-12-09T04:49:16+05:30 IST