ఓటీఎస్‌ను వెనక్కు తీసుకోవాల్సిందే..

ABN , First Publish Date - 2021-12-07T05:02:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఓటీఎస్‌ చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు సోమవారం నిరసనలు తెలిపాయి.

ఓటీఎస్‌ను వెనక్కు తీసుకోవాల్సిందే..
భామిని: అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న నిమ్మక జయకృష్ణ తదితరులు

టీడీపీ నాయకుల నిరసనలు  

 జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి

(ఆంధ్రజ్యోతి బృందం)

రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఓటీఎస్‌ చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు సోమవారం నిరసనలు తెలిపాయి. ఓటీఎస్‌ పేరుతో పేదలను వేధిస్తోందని, తక్షణం దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలను అందించారు. మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, కలమట రమణ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించి జీవించే హక్కును వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన జరుగుతోందని విమర్శించారు. 

Updated Date - 2021-12-07T05:02:57+05:30 IST