కేంద్ర ప్రసార శాఖ నియంత్రణలోకి ఓటీటీ!

ABN , First Publish Date - 2020-07-08T07:26:07+05:30 IST

అనేక ఓవర్‌ ద టాప్‌(ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లపై ప్రసారమవుతున్న వీడియో ప్రసారాలను తమ శాఖ నియంత్రణ కిందికి తీసుకురావాలని సమాచార ప్రసార శాఖ భావిస్తోంది...

కేంద్ర ప్రసార శాఖ నియంత్రణలోకి ఓటీటీ!

న్యూఢిల్లీ, జూలై 7: అనేక ఓవర్‌ ద టాప్‌(ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లపై ప్రసారమవుతున్న వీడియో ప్రసారాలను తమ శాఖ నియంత్రణ కిందికి తీసుకురావాలని సమాచార ప్రసార శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో నడుస్తున్న ప్రసారాలన్నీ ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. వాటిని తమ నియంత్రణలోకి తీసుకురావాలని ప్రతిపాదన ఉందని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే మంగళవారం తెలిపారు.


Updated Date - 2020-07-08T07:26:07+05:30 IST