ఓటీటీలో సందడే సందడి!

కరోనా ఉదృతి తీవ్రంగా ఉండడంతో సినీరంగంలో పనులు ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. పరిస్థితులు మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు ఓటీటీ వేదికగా సందడి చేశాయి. ఈ నెలలో మరికొన్ని చిత్రాలు హల్‌చల్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు:


ఫ్యామిలీమ్యాన్‌ సక్సెస్‌ తర్వాత దాని రెండో సిరీస్‌ కోసం జనాలు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. రాజ్‌, డీకే ద్వయం రూపొందించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ఈ నెల  4 నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. 


1. టైటిల్‌: ఫ్యామిలీమ్యాన్‌ 2

ఓటీటీ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ 

విడుదల తేదీ: జూన్‌ 4.
2. టైటిల్‌: కాలా (మలయాళ నటుడు టోవినో థామస్‌ నటించిన చిత్రం) 

ఓటీటీ వేదిక:  ఆహా

విడుదల తేదీ: జూన్‌ 4.


3. టైటిల్‌: ‘అర్థశతాబ్దం’ (కార్తీక్‌ రత్నం నటించిన చిత్రం)

విడుదల తేదీ: జూన్‌ 11

ఓటీటీ వేదిక: ఆహా


4.  ‘షేర్నీ’ (విద్యాబాలన్‌ కీలక పాత్రలో అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వం వహించిన చిత్రం’

విడుదల తేదీ: జూన్‌ 18, 2021

ఓటీటీ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌


5. టైటిల్‌: సన్‌ ఫ్లవర్‌ (సునీల్‌ గ్రోవర్‌ నటించిన సినిమా)

ఓటీటీ వేదిక:  జీ5

విడుదల తేదీ: జూన్‌ 11.
6. జగమే తంత్రం (ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం)

విడుదల తేదీ: జూన్‌ 18

ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌


వీటితోపాటు ‘లోకి’, ‘కిమ్స్‌ కన్వీనియన్స్‌’, ‘బ్లాక్‌ సమ్మర్‌ సీజన్‌2’,  ‘స్కేటర్‌ గర్ల్‌’, ‘డామ్‌’,  ‘రాయా అండ్‌ ది లాస్ట్‌ డ్రాగెన్‌’, ‘మోర్టల్‌ కాంబ్యాట్‌’, ‘రే’ వంటి ఇంగ్లిష్‌ చిత్రాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. 

Advertisement
Advertisement