ఓటేసినందుకు గర్భిణిపై ప్రత్యర్థుల దాడి

ABN , First Publish Date - 2021-03-09T06:43:49+05:30 IST

అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీచేసిన అభ్యర్థినికి మద్దతుగా నిలిచిన ఆమె మేనత్తపై స్థాని కంగా ఉన్న నలుగురు మహిళలు దాడిచేసిన ఘటనలో సదరు మహిళ గర్భస్రా వానికి గురైంది.

ఓటేసినందుకు గర్భిణిపై ప్రత్యర్థుల దాడి
బాధితురాలితో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి

 దాంతో గర్భస్రావం.. బాధితురాలు అభ్యర్థి మేనత్త

మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆధ్వర్యంలో ఏఎస్పీకి ఫిర్యాదు

రంపచోడవరం, మార్చి 8: అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీచేసిన అభ్యర్థినికి మద్దతుగా నిలిచిన ఆమె మేనత్తపై స్థాని కంగా ఉన్న నలుగురు మహిళలు దాడిచేసిన ఘటనలో సదరు మహిళ గర్భస్రా వానికి గురైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఆమె కథనం ప్రకారం అడ్డతీగల మం డలం ధాన్యంపాలెం పంచాయతీ రావులపాడె గ్రామానికి చెందిన కెచ్చల రాజమ్మ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీచేశారు. కాగా ఆమె ఓటమి పాల య్యారు. అయితే ఆమెకు మద్దతుగా నిలిచిన ఆమె మేనత్త దాని కృష్ణకుమారిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వైసీపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని, ఈ కారణంగా దాని కృష్ణకుమారికి గర్భస్రావం జరిగిందని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు ధాన్యంపాలెం ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం ఆమెను అడ్డతీగల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు మెడికో లీగల్‌ కేసుగా బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఎవరె వరు తనపై దాడిచేసిందీ, ఏ  కారణంగా తాను గర్భస్రావానికి గురైంది బాధితురాలు పోలీసులకు వివరించినా ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆరోపించారు. తనకు న్యాయం జర క్కపోవడంతో బాధితురాలిని తీసుకుని రాజేశ్వరి రంపచోడవరం ఏఎస్పీ బిందుమాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితురాలిపై దాడిచేసి ఆమె గర్భస్రావానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజేశ్వరి డిమాండ్‌ చేశారు. కేవలం వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేయకుండా ప్రత్యర్థికి ఓట్లు వేశారన్న కారణంతోనే వైసీపీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డా రని రాజేశ్వరి ఆరోపించారు. ఇక్కడి దారుణంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు వివరించామని రాజేశ్వరి అన్నారు. రాజేశ్వరితో పాటు స్థానిక తెలుగుదేశం నాయకులు అడబాల బాపిరాజు, పి.సూర్య నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోక పోతే ఆందోళన చేపడతామని రాజేశ్వరి స్పష్టం చేశారు.



Updated Date - 2021-03-09T06:43:49+05:30 IST