Abn logo
Sep 19 2021 @ 07:42AM

HYD: బీడీ కార్మికురాలి కూతురు..మమతకు ఓయూ డాక్టరేట్‌

హైదరాబాద్/ఉప్పల్‌: బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ తన కూతురును ఉన్నత చదువులు చదివించింది. తల్లి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి ఓయూలో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ను కూడా పొందింది ఆమె కూతురు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణం ప్రజ్ఞాపూర్‌కు చెందిన గౌడ వినోద దయానందంల కూతరు మమత భౌతిక శాస్త్రం విభాగంలో పీహెచ్‌డీని పూర్తి చేసినట్లు ఓయూ ఎగ్జామినేష్‌ కంట్రోలర్‌ ప్రకటించారు. ప్రొఫెసర్‌ మధూకర్‌ గైడెన్స్‌లో మమత ‘ప్రిపెరేషన్‌ ఆఫ్‌ సమ్‌ బయో-పాలిమర్స్‌ నానో కాంపోజిట్స్‌ త్రో గ్రీన్‌ అప్రోచ్‌ అండ్‌ దేర్‌ క్యారక్టెరైజేషన్‌’పై పరిశోధనను పూర్తి చేసినందుకు గాను ఓయూ పీహెచ్‌డీని అందజేసింది.