Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 1 2021 @ 15:25PM

అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌గా... మన ‘ఎస్‌వీఆర్’

హైదరాబాద్ : మరో తెలుగోడికి అంతర్జాతీయ కిరీటం దక్కింది. ఇటీవలి కాలంలో తెలుగు ప్రముఖులు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలకు సంబంధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోన్న విషఫయం తెలిసిందే. ఇదే కోవలో మరో తెలుగు ప్రముఖుడు కూడా చేరాడు. అంతర్జాతీయ పీస్అంబాసడర్‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సరికొండ వినయ్‌ రెడ్డి(ఎస్‌వీఆర్) నియమితులయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ పురస్కారంతోపాటు, పదవీబాధ్యతలను స్వీకరించారు. దుబాయ్ రాజు షేక్ ఒబైద్ బిన్ చేతులమీదరగా ఎస్‌వీ రెడ్డి ఈ గౌరవాన్ని, బాధ్యతలను స్వీకరించారు. 


 కాగా... తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవానికి ఎంపికైన మొట్టమొదటి ప్రముఖుడు ఎస్‌వీఆర్ కావడం విశేషం. ఫ్లోరిడా(అమెరికా)లోని వరల్డ్ హ్యుమానిటీ కమిషన్(భారత్) ఈ గౌరవాన్ని ప్రకటించింది. సమాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలకు సంబంధించి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందిస్తున్నట్లు కమివషన్ ఈ సందర్భంగా పేర్కొంది. నిజామాబాద్ జిల్లా బిక్కనూరుకు చెందిన ఎస్‌వీఆర్... దేశవ్యాప్తంగా ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థల తరపున, ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా సామాజిక సేవలనందిస్తుండడం గమనార్హం. అంతేకాదు... ఇతరత్రా ఎటువంటి విరాళాలనూ స్వీకరించకుండా, కేవలం తన సొంత ఖర్చుతోనే ఈ కార్యక్రమాలను ఎస్‌వీ రెడ్డి చేపడుతుండడం గమనార్హం. 


ఇదిలా ఉంటే... తమతో కలిసి పనిచేయాల్సిందిగా ఎస్‌వీ రెడ్డిని పలు అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానిస్తుండడం విశేషం. కాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకునిగా జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే క్రియాశీల బాధ్యతలను నిర్వర్విస్తోన్న రెడ్డిని... ఇదే క్రమంలో... జాతీయస్థాయిలో ఓ ప్రముఖ సంస్థ కు సారధ్య బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు వినవస్తోంది. కాగా... అంతర్జాతీయ శాంతి రాయబారిగా నియమితుడైన ఎస్‌వీఆర్ ను పలువురు ప్రముఖులు అభినందించారు. 


  

Advertisement
Advertisement