మా మాట

ABN , First Publish Date - 2020-12-31T06:07:39+05:30 IST

పొలాలల్ల ఉండకుంట శెవ్వా డిల్లికి ఉర్కొస్తర పుజూల్గ లొల్లి బెడ్తర...

మా మాట

పొలాలల్ల ఉండకుంట 

శెవ్వా డిల్లికి ఉర్కొస్తర 

పుజూల్గ లొల్లి బెడ్తర 

యాడ బడ్తె గాడ అమ్ముకోమంటిమి 

ఎంత బడ్తె గంత దాపెట్టుకోమంటిమి 

గుత్త కిచ్చుకోని అవ్వల్‌ దర్జగ 

ఉండు మంటిమి 

సౌలత్లు ఎన్నో జేస్తిమి 


యాడ బడ్తె గాడ పడ్తల్‌ బడదంటిరి 

గొదాంలు లేకుంటె ఎట్ల దాస్కోవాలంటిరి 

గుత్తకిస్తె పొలం కరాబైతదంటిరి 

మీరెక్కల కస్టం దోస్కున్నమనబట్టిరి


మంది మాట లింటిరి 

సౌలత్ల మత్లబ్‌ ఏందంటిరి 

సడక్ల మీదికొస్తిరి సలికి సస్తుంటిరి 

చట్టం మీ సుట్టమంటె ఇనకుంటిరి 

గాయి గాయి జేస్తుంటిరి 

గత్తర్‌దల్గని తిడ్తుంటిరి 


మీరెట్ల బోతె మాకేంది 

మేమైత మంచిగున్నం బేఫికర్గ బన్నం

పోలీసోల్లు మాకున్నరు 

గుత్తెదార్లు మా దిక్కున్నరు 

దేవుల్లు గుడ్క మా దిక్కున్నరు 

దిక్కు లేదు మీకు పొమ్మన్నరు 


మల్ల మల్లం జెప్తున్నం 

మనసు మాట ఇనుండ్రి ఇండ్లకుబోయి పండుకోండ్రి 

జై కిసాన్‌ జై శంశాన్‌ 

తెలిదేవర భానుమూర్తి

Updated Date - 2020-12-31T06:07:39+05:30 IST