Abn logo
Aug 5 2020 @ 04:06AM

మరో 141..ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

ఖమ్మం జిల్లాలో 103, భద్రాద్రిలో 38మందికి లక్షణాలు 


(ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం నెట్‌వర్క్‌)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో 141 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో జనం మరింత ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 272మందికి ర్యాపిడ్‌ కిట్స్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 103మందికి లక్షణాలున్నట్టు నిర్ధారణైందని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి హెల్త్‌బులిటెన్‌లో ప్రకటించారు.   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 38మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తొమ్మిది మందికి, కల్లూరులో నలుగురికి, వైరాలో ఓ మండల అధికారి సహా ఐదుగురికి, కొణిజర్ల మండలంలోని పెద్దగోపతి పీహెచ్‌సీలో ఇద్దరికి, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ఇద్దరికి, ముదిగొండ మండలంలో ఇద్దరికి, బోనకల్‌లో ఓ వ్యాపారికి, ఆళ్లపాడులో ఒకరికి, మధిరలో ఒకే కుటుంబంలో ముగ్గురికి, కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన ఓ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ నిర్ధారణైంది. వీరు కాకుండా జిల్లాలో మరో 73మందికి లక్షణాలు కనిపించాయి. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఇద్దరికి, కరకగూడెం పీహెచ్‌సీలో పని చేస్తున్న ఓ వ్యక్తికి, అతడితో ప్రైమరీ కాంటాక్టు ఉన్న ఇద్దరికి, చర్ల మండలంలో ఇద్దరికి, అశ్వాపురం హెవీవాటర్‌ ప్లాంట్‌ గౌతమీనగర్‌ కాలనీలో ఆరుగురికి, గుండాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌కు, ఆళ్లపల్లిలోని ఓ వ్యాపారి కూతురికి, ఇల్లెందు పట్టణంలో ఆరుగురికి, జూలూరుపాడు మండలం పడమటనర్సాపురంలో ఇద్దరికి, భద్రాచలంలో ఆరుగురికి, మణుగూరులో పదిమందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక కొవిడ్‌ లక్షణాలతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా కన్నుమూశారు. అయితే జిల్లా అధికారులు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేయకపోవడంతో కరోనా సమాచారంలో గందరగోళం కనిపిస్తోంది. 

Advertisement
Advertisement