30 ఏళ్ల కష్టం ఒక్క ఆదేశంతో నష్టం

ABN , First Publish Date - 2021-01-20T05:09:59+05:30 IST

30ఏళ్లుగా... ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొంది.. రెండు పర్యాయాలు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డులు అందుకున్న ఆ చిరుద్యోగికి.. ప్రభుత్వ ఆదేశాలతో తీరని నష్టం వా టిల్లుతోంది..

30 ఏళ్ల కష్టం ఒక్క ఆదేశంతో నష్టం
తనకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలంటూ కలెక్టర్‌ను వేడుకోవడానికి వచ్చిన ఎస్కే అఫ్జల్‌మియా

వీధినపడ్డ డ్రైవర్‌ కుటుంబం

ప్రత్యామ్నాయం చూపాలంటూ వేడుకోలు

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 19: 30ఏళ్లుగా... ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొంది.. రెండు పర్యాయాలు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డులు అందుకున్న ఆ చిరుద్యోగికి.. ప్రభుత్వ ఆదేశాలతో తీరని నష్టం వా టిల్లుతోంది.. ఇప్పటి వరకు కష్టాన్ని నమ్ముకున్న ఆ డ్రైవర్‌ కుటుంబం ఒక్కసారిగా దిక్కుతోచని అగాథంలో కూరుకుపోయిం ది.. దీంతో తనకు ప్రత్యామ్నాయాన్ని చూపాలంటూ ఆ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు. ఖమ్మానికి చెందిన ఎస్కే అప్జల్‌మియా 1991లో అక్షరదీపం జిల్లా సాక్షరతాసమితి కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి 2009 వరకు 18ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తర్వాత 2009 నుంచి మరో 11 ఏళ్లపాటు ఇప్పటి వరకు వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అధికారులకు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ 30ఏళ్లలో ఎందరో అధికారుల మన్ననలను పొందాడు అఫ్జల్‌మియా. రెండు పర్యాయాలు ఉత్తమ సేవలందించినందుకు గాను ఉ న్నతాధికారులు ప్రశంసాపత్రాలను కూడా అందచేశారు. విధినిర్వహణలో ఏలాంటి అలసత్వం వహించడం.. కానీ చేసేవాడు కాడు. ఇంతటి నిబద్ధత గల డ్రైవర్‌కు ఇటీవలె కష్టం కలిగింది.. కృషివిజ్ఞాన కేంద్రం వైరాలో ఖాళీలను భర్తీ చేయాలన్న లక్ష్యంతో జయశంకర్‌ విశ్వవిద్యాలయం నుంచి నోటీసులు ఇచ్చారు. పూర్తిస్థాయిలో డ్రైవర్‌పోస్టును భర్తీ చేస్తున్నట్లు ఆ లేఖ సారాంశం. దీంతో జనవరి నెలాఖరు నుంచి తనను తొలగించనున్నట్లు ముందస్తు నోటీసులను అం దించడంతో అఫ్జల్‌మియా దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నాడు. 30ఏళ్లుగా డ్రైవర్‌ ఉద్యోగాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్న తాను ఏ పనీ చేసుకోలేనని.. ఈ వయస్సులో వచ్చిన కష్టానికి కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు. కనిపించిన అధికారులను కళ్లావేళ్లాపడి బ్రతిమిలాడుతున్నాడు.. మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంకు వచ్చిన ఆయన కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ను కలిసి తనగోడును వెళ్లదీసుకున్నాడు. 30ఏళ్లుగా చేసిన సేవను గుర్తించి తనకు ప్రత్యామ్నాయాన్ని కల్పించి తన కుటుంబం వీధిన పడకుండా కాపాడాలంటూ కలెక్టర్‌ను వేడుకుంటున్నాడు. 


Updated Date - 2021-01-20T05:09:59+05:30 IST