లైగింక వేధింపులపై సుందర్ పిచాయ్‌కి ఉద్యోగుల బహిరంగ లేఖ!

ABN , First Publish Date - 2021-04-10T23:23:25+05:30 IST

ఆల్ఫాబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ఆ సంస్థకు చెందిన దాదాపు 1200 మంది ఉద్యోగులు బహిరంగా లేఖ రాశారు. ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని సంస్థ రక్షిస్తోందని అందులో ఆరో

లైగింక వేధింపులపై సుందర్ పిచాయ్‌కి ఉద్యోగుల బహిరంగ లేఖ!

వాషింగ్టన్: ఆల్ఫాబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ఆ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు బహిరంగా లేఖ రాశారు. ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని సంస్థ రక్షిస్తోందని అందులో ఆరోపించారు. ఈ పద్ధతిని వెంటనే మార్చుకోవాలని సూచించారు. వేధింపులకు పాల్పడే వారికి టీమ్‌ను లీడ్ చేసే అర్హత లేదని వెల్లడించారు. వెంటనే వారిని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా లైంగిక వేధింపుల నుంచి ఉద్యోగులకు సంస్థ రక్షణ కల్పించాలని లేఖ ద్వారా సుందర్ పిచాయ్‌ను డిమాండ్ చేశారు.


‘ఉద్యోగులకు ఆల్ఫాబెట్ సురక్షితమైన వాతావరణాన్ని అందించడం లేదు. ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని సంస్థ కాపాడుతోంది. దీన్ని వెంటనే ఆపాలి. ఉద్యోగులకు రక్షణ కల్పించాలి’ అని ఉద్యోగులు పేర్కొన్నారు. కాగా.. గూగుల్‌పై ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఎమీ నెట్‌ఫెల్డ్.. తాజాగా ఇటువంటి ఆరోపణలే చేశారు. గూగుల్‌లో పని చేస్తున్నప్పుడు తాను వేధింపులకు గురైనట్టు వెల్లడించారు. అయితే ఆ కేసును గూగుల్ సంస్థ బలహీనపర్చినట్టు న్యూయార్క్ టైమ్స్ ద్వారా తెలియజేసింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఆల్ఫాబెట్ ఉద్యోగులు సందర్ పిచాయ్‌కి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2021-04-10T23:23:25+05:30 IST