ఒమ‌న్ నుంచి భార‌త్ చేరిన 50వేల మంది ప్ర‌వాసులు

ABN , First Publish Date - 2020-08-04T17:17:53+05:30 IST

క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో గ‌త మూడు నెల‌ల్లో రిపాట్రియేష‌న్‌, చార్టెడ్ విమానాల్లో దాదాపు 50వేలకు పైగా మంది భార‌త ప్ర‌వాసు ఒమ‌న్ నుంచి స్వ‌దేశానికి చేరార‌ని ఒమ‌న్‌లోని భార‌త‌ దౌత్య కార్యాల‌యం తెలిపింది.

ఒమ‌న్ నుంచి భార‌త్ చేరిన 50వేల మంది ప్ర‌వాసులు

మ‌స్క‌ట్: క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో గ‌త మూడు నెల‌ల్లో రిపాట్రియేష‌న్‌, చార్టెడ్ విమానాల్లో దాదాపు 50వేలకు పైగా మంది భార‌త ప్ర‌వాసు ఒమ‌న్ నుంచి స్వ‌దేశానికి చేరార‌ని ఒమ‌న్‌లోని భార‌త‌ దౌత్య కార్యాల‌యం తెలిపింది. మే నెల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వివిధ స్వ‌చ్చంద సంస్థ‌లు, కంపెనీలు ఏర్పాటు చేసిన‌ 198 చార్టెడ్ విమానాల ద్వారా 35వేల మంది ప్ర‌వాసుల‌ను భార‌త్‌కు త‌ర‌లించిన‌ట్లు ఇండియ‌న్ ఎంబ‌సీ తెలియ‌జేసింది.


అలాగే భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన 'వందే భార‌త్ మిష‌న్‌'లో భాగంగా 97 విమానాల్లో మ‌రో 17వేల మంది ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చిన‌ట్లు పేర్కొంది. ఒమ‌న్‌లో మే 9 నుంచి ప్రారంభ‌మైన వందే భార‌త్ మిష‌న్‌ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 105 విమానాలు భార‌త్‌కు వ‌చ్చిన‌ట్లు ఎంబ‌సీ సెకండ్ సెక్ర‌ట‌రీ అనూజ్ స్వ‌రూప్ తెలిపారు. ఆగ‌స్టులో వందే భార‌త్ మిష‌న్ ఐదో ద‌శ‌లో భాగంగా ఒమ‌న్ నుంచి మ‌రో 19 రిపాట్రియేష‌న్ విమానాలు న‌డ‌ప‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కాగా, ఒమ‌న్‌లో సుమారు 9 మిలియ‌న్ల మంది భార‌త ప్ర‌వాసులు ఉన్న‌ట్లు స‌మాచారం. 


ఇదిలా ఉంటే... ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ఇప్ప‌టివ‌ర‌కు 79,159 మందికి ప్ర‌బ‌లింది. 422 మందిని పొట్ట‌బెట్టుకుంది. కోవిడ్ ప్ర‌భావంతో ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా కుదేలైంది. దీంతో చాలా మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. చాలా మంది ప్ర‌వాసులు కూడా ఉపాధి కోల్పోయి ఒమ‌న్ నుంచి స్వ‌దేశాల‌కు చేరుకుంటున్నారు.    

Updated Date - 2020-08-04T17:17:53+05:30 IST