వ్యాక్సిన్‌ కోసం వస్తే గెంటేస్తారా ?

ABN , First Publish Date - 2021-06-18T05:27:19+05:30 IST

వ్యాక్సిన్‌ కోసం వస్తే గెంటేస్తారా ?

వ్యాక్సిన్‌ కోసం వస్తే గెంటేస్తారా ?
రాజీవ్‌నగర్‌ కాలనీ వద్ద వ్యాక్సినేషన్‌ కోసం క్యూలో నిలుచున్న పట్టణ ప్రజలు

(ఆంధ్రజ్యోతి వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చిన వారి పట్ల అక్కడి సిబ్బంది దురుసుగా వ్యవహరించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. అనంతగిరి రోడ్డులో రాజీవ్‌నగర్‌ కాలనీ ఎదురుగా ఉన్న కొత్త ఏరియా ఆసుపత్రిలో కొన్నిరోజులుగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌ కోసం పట్టణ ప్రజలే కాకుండా పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు. అయితే గురువారం వ్యాక్సినేషన్‌ కోసం వచ్చిన వారి పట్ల ఆసుపత్రి సిబ్బంది దురుసుగా వ్యవహరించడాన్ని అక్కడ క్యూలో నిలుచుకున్న వారు తీవ్రంగా తప్పుబట్టారు. వ్యాక్సిన్‌ కోసం నిలుచుకున్న పలువురిని ఆసుపత్రి నుంచి బయటకు పంపి డోర్‌ పెట్టడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-06-18T05:27:19+05:30 IST