ఓవర్‌ బ్రిడ్జి మంజూరయ్యేనా ?

ABN , First Publish Date - 2021-06-17T06:26:23+05:30 IST

గిద్దలూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న రాచర్ల రైల్వేగేటు వద్ద నిత్యం ట్రాఫిక్‌ స మస్య తాండవిస్తూనే ఉంటుంది.

ఓవర్‌ బ్రిడ్జి మంజూరయ్యేనా ?
గేటుకు ఇరువైపులా బారులు తీరిన వాహనాలు, ద్విచక్ర వాహనదారులు

వెంటాడుతున్న ట్రాఫిక్‌ సమస్య

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

గిద్దలూరు, జూన్‌ 16 : గిద్దలూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న రాచర్ల రైల్వేగేటు వద్ద నిత్యం ట్రాఫిక్‌ స మస్య తాండవిస్తూనే ఉంటుంది. రైల్వేలైన్‌పై ఓవర్‌ బ్రిడ్జి గానీ, అండర్‌ బ్రిడ్జి గానీ ఏర్పాటు చేస్తే తప్ప ఈ ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించదు. బ్రిడ్జిల ఏర్పాటు కోసం గత నాలుగు దశాబ్ధాలుగా పాలకులు, అధికారులు హామీలు ఇస్తున్నారే తప్ప అమలు జరుగడం లేదు. అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలు అవుతున్నాయే తప్ప ఆచరణ జరుగడం లేదు. ఫలితంగా రైలు, గూడ్స్‌ రైలు వచ్చి, వెళ్లే సందర్భాలలో రాచర్ల గేటు వద్ద కనీసం అరగం ట పాటు ట్రాఫిక్‌ స్తంభించి పోతున్నది. రైల్వేలైన్‌కు స మాంతరంగా పక్కనే అనంతపురం-గుంటూరు జాతీ య రహదారి ఉండడంతో రైలుగేటు పడిన ప్రతిసారి చాంతాడంత క్యూలతో నేషనల్‌ హైవేపై కూడా ట్రా ఫిక్‌ ఆగిపోతుండడంతో వాహన చోదకులతోపాటు ప్ర యాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

క్రాసింగ్‌ సమయంలో రైలు లేదా గూడ్స్‌లు ఒకటి వచ్చి మరొకటి వెళ్లే వరకు రైల్వే గేటు తీయరు. ఈసందర్భాలలో సమయం ఎక్కువ సేపు పడుతుండడంతో గేటుకు ఇరువైపులా వాహనాలు, ద్విచక్ర వాహ న చోదకులు ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. ఈప్రాంతంలో ఓవర్‌ బ్రిడ్జి గానీ, అండర్‌ బ్రిడ్జి గానీ ఏర్పాటు చేసి పాములపల్లి రైల్వేగేటు ప్రాం తానికి కూడా కొద్దిదూరం రోడ్డు నిర్మాణం చేస్తే పట్టణంలోని రెండు ప్రాంతాలలో రైల్వే వచ్చే సందర్భాలలో బ్రిడ్జిల గుండా వెళ్లే అవకాశం ఉంటుంది కావున ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. రాచర్ల గేటుకు సమీపంలో వర్షం నీరు వెళ్లేందుకు గతంలో రైల్వే అధికారులు చిన్నపాటి బ్రిడ్జిని ఏర్పాటు చేశారుఎ. ప్రస్తుతం ఆ బ్రిడ్జిని ఆధారంగా చేసుకుని తారురోడ్డు వరకు అప్రోచ్‌ రోడ్డు నిర్మిస్తే ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలు గేటు పడినా సులభంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. పాలకులు, అధికారులు స్పందించి శాశ్వతంగా అండర్‌ బ్రిడ్జి, ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపించాలని, అప్పటివరకు ప్రత్యామ్నాయంగా వర్షం నీరు వెళ్లే అండర్‌ బ్రిడ్జి ద్వారా రాకపోకలకు రోడ్డు నిర్మిస్తే చాలావరకు సమస్య పరిష్కారం కానున్నదని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2021-06-17T06:26:23+05:30 IST