Abn logo
Sep 10 2021 @ 20:32PM

ఎక్కువ ఖర్చు చేసేది మనమే...

న్యూఢిల్లీ : ప్రస్తుత దశాబ్దం ముగిసే నాటికి అమెరికా, చైనాల తర్వాత 70 డాలర్లు(సుమారు రూ. 5 వేలు),   అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కుటుంబాల జాబితాలో భారతదేశం మూడో స్థానంలో ఉండే అవకాశాలున్నాయి. మెకెంజీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ (ఎంజీఐ) తన తాజా నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను అందించింది. దీని ప్రకారం, ఈ విషయంలో ముంబై నగరం ఆసియాలో నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


రాబోయే దశాబ్దంలో ఆసియా అదనంగా ట్రిలియన్ డాలర్ అమ్మకాల అవకాశాలను సృష్టించగలదని మెకెంజీ వ్యాపార, ఆర్థిక పరిశోధన విభాగం ఎంజీఐ పేర్కొంది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం... రాబోయే దశాబ్దంలో ఆసియా ప్రపంచ వినియోగం వృద్ధిలో సగానికి దోహదం చేస్తుంది. ఈ కాలంలో భారతదేశంలో వినియోగం 18 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని నివేదించింది.