నెలలో వందకోట్లకుపైగా యాక్టివ్‌ యూజర్లు

ABN , First Publish Date - 2021-10-02T05:38:47+05:30 IST

టిక్‌టాక్‌కు ఉన్న ఆదరణ చాలా ఎక్కువే. నెలకు ఒక బిలియన్‌ మంది యూజర్లు యాక్టివ్‌గా ఉంటున్నారట. అంతేకాదు గత ఏడాది జూలై నుంచి 45 శాతంపైగా పెరుగుదల

నెలలో వందకోట్లకుపైగా యాక్టివ్‌ యూజర్లు

టిక్‌టాక్‌కు ఉన్న ఆదరణ చాలా ఎక్కువే. నెలకు ఒక బిలియన్‌ మంది యూజర్లు యాక్టివ్‌గా ఉంటున్నారట. అంతేకాదు గత ఏడాది జూలై నుంచి 45 శాతంపైగా పెరుగుదల నమోదు అయిందట. అమెరికా, యూరప్‌, బ్రెజిల్‌, ఆగ్నేయాసియాలో టిక్‌టాక్‌ షోలకు విపరీతమైన ఆదరణ వస్తోంది. 2018 నాటికి తమకు 55 మిలియన్ల మంది యూజర్లు ఉండేవారని టిక్‌టాక్‌ అధికారికంగా తెలిపింది. క్రమంగా 2020 జూలైనాటికి ఈ సంఖ్య 689 మిలియన్లకు పెరిగింది. ఇది చైనాకు చెందిన  టెక్నాలజీ జెయింట్‌ ‘బైట్‌డాన్స్‌’కి చెందినదనే విషయం తెలిసిందే. సింగపూర్‌ జాతీయుడు షౌజీ చ్యూ ప్రస్తుతం దీనికి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2021 జూన్‌ నాటికి ఫేస్‌బుక్‌కు ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 

Updated Date - 2021-10-02T05:38:47+05:30 IST