బౌద్ధ ఆశ్రమంలో 154 మంది సాధువులకు కరోనా

ABN , First Publish Date - 2021-03-03T13:05:32+05:30 IST

కంగ్రా జిల్లా జోన్‌గ్యూటో బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా సోకింది....

బౌద్ధ ఆశ్రమంలో 154 మంది సాధువులకు కరోనా

ధర్మశాల : కంగ్రా జిల్లా జోన్‌గ్యూటో బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా సోకింది. ఫిబ్రవరి 18వతేదీన టిబెటన్ కొత్త సంవత్సరం సందర్భంగా బౌద్ధ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి.బౌద్ధ ఆశ్రమంలో గత వారం 20 మందికి కరోనా సోకడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు 330 మంది సాధువులకు కరోనా పరీక్షలు చేశారు.దీంతో వారిలో 154 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 8 రోజుల్లోనే 154 మందికి కరోనా సోకడంతో గ్యూటో ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.ఈ ఆశ్రమానికి కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 23వతేదీన 15 మంది బౌద్ధ బిక్షకులు వచ్చారు. 


కరోనా వచ్చిన సాధువుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని,ప్రయాణాలు చేసి వచ్చిన వారికి ఆశ్రమంలోనే క్వారంటైన్ చేశామని కంగ్రా జిల్లా కలెక్టరు రాకేష్ ప్రజాపతి చెప్పారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు కరోనా నెగిటివ్ అని తేలింది. ఇందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ను తాండ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించామని కలెక్టరు వివరించారు.ధర్మశాలలోని కరోనా ప్రబలిన బౌధ్ధఆశ్రమానికి సీలు వేశామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చెప్పారు. బౌద్ధ ఆశ్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేశామని అధికారులు చెప్పారు.

Updated Date - 2021-03-03T13:05:32+05:30 IST