అమెరికాలో 10లక్షల మంది పిల్లలకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-11-17T12:27:21+05:30 IST

కరోనా వైరస్ అమెరికా దేశంలోని 10లక్షలమంది పిల్లలకు సోకిందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్సు తాజా నివేదిక....

అమెరికాలో 10లక్షల మంది పిల్లలకు కరోనా పాజిటివ్

వాషింగ్టన్ (అమెరికా) : ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిన కరోనా వైరస్ అమెరికా దేశంలోని 10లక్షలమంది పిల్లలకు సోకిందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్సు తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా వైరస్ ప్రారంభమైన నాటి నుంచి నవంబరు 12వతేదీ వరకు అమెరికాలో 10,39,464 మంది పిల్లలకు కొవిడ్ -19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. గడచిన వారం రోజుల్లోనే అమెరికాలో 1,11,946 మంది పిల్లలకు కరోనా సోకిందని పరీక్షల్లో వెల్లడైందని చిన్నపిల్లల వైద్యులు చెప్పారు. గతంలో కంటే పిల్లల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెపుతున్నారు. 


మీజిల్సు, పోలియో వ్యాక్సిన్ లు తీసుకున్న పిల్లలకు కరోనా వైరస్ సోకలేదని పిల్లల వైద్యుల సంఘం అధ్యక్షుడు సాలీగోజా చెప్పారు. చిన్న పిల్లల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమెరికా ప్రభుత్వం జాతీయ వ్యూహాన్ని వెంటనే అమలు చేయాలని డాక్టర్ గోజా అమెరికా సర్కారును కోరారు. అమెరికాలో 14 శాతం మంది తల్లిదండ్రుల వల్లే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని తమ సర్వేలో తేలిందని డాక్టర్ గోజా వివరించారు. 

Updated Date - 2020-11-17T12:27:21+05:30 IST