సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో 88 శాతం విద్యార్ధులు పాస్

ABN , First Publish Date - 2020-07-14T00:22:39+05:30 IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇవాళ 12వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది...

సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో 88 శాతం విద్యార్ధులు పాస్

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇవాళ 12వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈసారి 11,92,961 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. ఇందులో 88 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించినట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘‘దీన్ని సాధ్యం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు. విద్యార్ధుల ఆరోగ్యం, ఉత్తమ విద్యకే మా తొలి ప్రాధాన్యత అని మరోసారి తెలియజేస్తున్నాను..’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-07-14T00:22:39+05:30 IST