అప్రమత్తతతో కొవిడ్‌ను అధిగమించొచ్చు

ABN , First Publish Date - 2021-06-14T06:11:01+05:30 IST

నిరంతర అప్రమత్తతతోపాటు ముందుజాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కొవిడ్‌ను అధిగమించవచ్చని ప్రముఖ వైద్యులు వీరభద్రయ్య, ఎండ్లూరి ప్రభాకర్‌ పేర్కొన్నారు.

అప్రమత్తతతో కొవిడ్‌ను అధిగమించొచ్చు
కొవిడ్‌ విజేతల ముఖాముఖిలో మాట్లాడుతున్న డాక్టర్‌ వీరభద్రయ్య

ప్రముఖ వైద్యులు వీరభద్రయ్య, ఎండ్లూరి ప్రభాకర్‌


అనంతపురం టౌన్‌, జూన్‌ 13 : నిరంతర అప్రమత్తతతోపాటు ముందుజాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కొవిడ్‌ను అధిగమించవచ్చని ప్రముఖ వైద్యులు వీరభద్రయ్య, ఎండ్లూరి ప్రభాకర్‌ పేర్కొన్నారు. నగరంలోని సింగమనేని స్మారక కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో చికిత్సపొంది కోలుకున్న వారితో ఆదివారం వారు ముఖాముఖి నిర్వహించారు. కా ర్యక్రమానికి జనరల్‌ ఫిజీషియన్‌ వీరభద్ర య్య, ప్రముఖ మానసిక వైద్యుడు ఎండ్లూరి ప్రభాకర్‌, వైద్యుడు కిషోర్‌ హాజరయ్యారు. వారు కొవిడ్‌ నుంచి కోలుకున్న వారితో ము చ్చటించారు. వారికి ఇంకా ఏవైనా సమస్యలు, సందేహాలుంటే అడిగి తెలుసుకుని, వాటికి తగిన సూచనలు చేశారు. డాక్టర్‌ వీరభద్ర య్య మాట్లాడుతూ కొవిడ్‌ సెకెండ్‌వేవ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. ఈ వ్యాధి వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రభుత్వ వైద్యా న్ని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కొవిడ్‌ గుర్తు చేస్తోందన్నారు. ప్రభుత్వవైద్యం బలంగానున్న క్యూబాలాంటి చిన్న చిన్న దేశాల్లో దీన్ని విజయవంతంగా అధిగమించారని తెలిపారు. మానసిక వైద్యు డు ఎండ్లూరి ప్రభాకర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాధి ప్రా ణాంతకమైనది కాదనీ, అప్రమత్తంగా వ్యవహరిస్తే దీని నుంచి సురక్షితంగా బయటపడవచ్చన్నారు. కార్యక్రమంలో విద్వాన్‌ విశ్వం విజ్ఞానకేంద్రం కన్వీనర్‌ ఏజీ రాజమోహన్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు జిలాన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు.


అందరి సహకారంతోనే ఇది సాధ్యం

సింగమనేని స్మారక కొవిడ్‌కేర్‌ సెంటర్‌ను ఇంతకాలం విజయవంతంగా నిర్వహించడం వెనుక అందరి సహకారం, తోడ్పాటు ఉన్నాయని సీపీఎం ఉత్తరప్రాంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. ఇక్కడితో ఈ సేవలు ఆగిపోవనీ, కరోనా కేసులు పూర్తిగా తగ్గేవరకూ కేంద్రాన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటివరకూ 259 మంది కొవిడ్‌ బాధితులకు వైద్యసేవలందించామన్నారు. ఇక్కడకు వచ్చిన ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో తిరగి ఇళ్లకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. కొవిడ్‌తో మృతిచెందిన అనాథల అం త్యక్రియలు నిర్వహించేందుకు సుందరయ్య సేవాదళం ఏర్పాటు చేశామన్నారు.


Updated Date - 2021-06-14T06:11:01+05:30 IST