Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 27 2021 @ 17:35PM

మోదీ ఒక్కరే వెళ్లడం తప్పు: అసదుద్దీన్ ఓవైసీ

న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా నిర్మాణ సందర్శనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్కరే వెళ్లడాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ప్రధాని ఒక్కరే వెళ్లడం రాజ్యాంగ విరుద్దమని ఆయన సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావించారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్ లేకుండా ప్రధాని ఎలా వెళ్తారని ఓవైసీ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు కురిపించారు.


‘‘సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. పార్లమెంట్ అనేది రాజ్యాంగానికి ప్రాథమిక అంగం. రాజ్యాంగం ప్రకారం.. అధికార విభజనల సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం న్యాయ, శాసన శాఖల్లో కార్యనిర్వాహక శాఖ తలదూర్చొద్దు. ప్రధాని మోదీ కార్యనిర్వాహక శాఖకు చెందినవారు. మరి పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ప్రధాని మోదీ ఒక్కరే వెళ్లి ఎలా సందర్శిస్తారు? అధికార విభజన సూత్రానికి ఇది వ్యతిరేకం. లోక్‌సభ సంరక్షకులు లోక్‌సభ స్పీకర్. మరి ఆయనెందుకు మోదీతో వెళ్లలేదు?’’ అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement