Abn logo
Sep 22 2021 @ 22:30PM

సొంత అన్నే హంతకుడు!

నిందితులతో డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి, సిబ్బంది

సొంత అన్నే హంతకుడు!

 ఈ నెల 13న హత్య

 ఇద్దరు అరెస్ట్‌ 

 వివరాలు వెల్లడించిన డీఎస్పీ

చిల్లకూరు, సెప్టెంబరు 22: మండలంలోని ముత్యాలపాడులో నెల 13 అర్థరాత్రి జరిగిన దయాకర్‌ అనే యువకుడి హత్య కేసులో అతడి సొంత అన్నే హంతకుడని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేఖరులకు వివరాలు వెల్లడించారు. కోట మండలం లక్ష్మక్కకండ్రిగకు చెందిన దయాకర్‌(28)కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తన ధనుంజయ పోషణలో ఉండేవాడు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు పాల్పడుతుండడంతో 15 ఏళ్ల క్రితం ధనుంజయ అతడికొ బైక్‌ మెకానిజం నేర్పించేందుకు హైదరాబాదులోకి బంధువుల ఇంట్లో ఉంచాడు. దయాకర్‌  అక్కడ కూడా అతను దొంగతనాలు చేస్తుండడంతో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏడాది జూన్‌లో అతడిని బెయిల్‌పై తీసుకువచ్చి, ముత్యాలపాడులోని తన మేనమామ కొడుకు శ్రీనివాసులు ఇంట్లో ఉంచాడు. అయినా, దయాకర్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల వారి చెల్లెలుకు పెళ్లి కుదరడంతో, దొంగతనాలు మానుకుని బుద్ధిగా ఉండకపోతే, తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా అన్న హెచ్చరించాడు. దీంతో ఆగ్రహించిన దయాకర్‌ తన అన్నను తీవ్ర పదజాలంతో దూషించాడు. ఇది మనసులో పెట్టుకున్న దయాకర్‌ అతడిని అంతమొందిం చేందుకు ప్రణాళిక రచించాడు. ఈ నెల 13న అర్ధరాత్రి నెల్లూరు నుంచి  కారులో ముత్యాల పాడుకు వచ్చి శ్రీనివాసులు ఇంటిమిద్దెపై నిద్రిస్తున్న దయాకర్‌ను కత్తితో పొడిచి హత్య చేసి, అదే కారులో ఇంటికి వెళ్లిపోయాడు.  14 వ తేదీ తెల్లవారు జామున చిన్నయ్య అనే వ్యక్తితో కలిసి ముత్యాలపాడుకు వెళ్లి దయాకర్‌ మృతదేహాన్ని లక్ష్మక్క కండ్రిగకు తరలించాడు. తన తమ్ముడిని ఎవరో హత్య చేశారంటూ చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీఐ శ్రీనివాసులురెడ్డి  అతడి అన్నే హంతకుడని గుర్తించారు. మంగళ వారం సాయంత్రం బూదనం టోల్‌ప్లాజా సమీపంలో నిందితుడితోపాటు, సాక్ష్యాలను నాశనం చేసేందుకు సహకరించిన ప్రదీప్‌కుమార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి, హత్యా సమయంలో వేసుకున్న దుస్తులు, కత్తి, రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.  సీఐ శ్రీనివాసులురెడ్డి, సిబ్బంది రాజు, చిరంజీవి, రహీం, సుబ్రమణ్యం, విష్ణు, నావూరయ్య, శ్రీనివాసులురెడ్డి, నరేష్‌, రఫీ తదితరులు పాల్గొన్నారు.