కార్మికులను మోసం చేస్తున్న యాజమాన్యం

ABN , First Publish Date - 2021-10-18T05:44:37+05:30 IST

గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభాల విషయంలో యాజమాన్యం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కలిసి కార్మికులను మోసం చేస్తన్నట్టు సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు.

కార్మికులను మోసం చేస్తున్న యాజమాన్యం
మాట్లాడుతున్న యాదగిరి సత్తయ్య

- సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య 

యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 17: గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభాల విషయంలో యాజమాన్యం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కలిసి కార్మికులను మోసం చేస్తన్నట్టు సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాభాల లెక్క తేలకముందే 60 కోట్లు సీఎఎస్‌ఆర్‌ కింద ఏవిధంగా కేటాయించారని ప్రశ్నించారు. 2018-19లో 1.766 కోట్ల లాభాల్లోంచి 2శాతంగా 40కోట్లు సీఎస్‌ఆర్‌ నిధుల కింద కేటాయిం చినట్టు సత్తయ్య తెలిపారు. 60 కోట్లు కేటాయించడంతో దాదాపు 3వేల కోట్ల లాభాలు వచ్చినట్టు అర్థం అవుతున్నట్టు తెలిపారు. వాస్తవ లాభాలను దాచి కార్మికుల కష్టార్జితాన్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తున్నట్టు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. లక్షాలను అధిగమించేందుకు కార్మికులు శ్రమిస్తున్నారని, ఉత్పత్తి, రవాణాలు పెరుగుతుంటే లాభాలు ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో బొగ్గు కొరత, విద్యుత్‌ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అ న్నారు. సింగరేణికి విద్యుత్‌ సంస్థల నుంచి 15వేల కోట్ల బకాయిలు ఇప్పించలే దని, కార్మికులకు ప్లేడే, పీహెచ్‌డీల్లో కోత విధించడంతో ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నట్టు సత్తయ్య తెలిపారు. సింగరేణి సీఎండీ హైదరాబాద్‌ హెడ్‌ఆఫీ స్‌కే పరిమితమై క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడంతో ఏరియా స్థాయిలో పాలన గాడి తప్పిందని, అవినీతి పెరిగినట్టు సత్తయ్య తెలిపారు. వెంటనే సిం గరేణి ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, పాత పద్ధతిలో ప్లేడే, పీహెచ్‌డీలు అమలుచేయాలని సత్తయ్య డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో నాయకులు సారంగపాణి, వేణుగోపాల్‌రావు, నీలపు రవి, శివాజీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:44:37+05:30 IST