ఆక్సిజన్‌ సిలిండర్ల విరాళం

ABN , First Publish Date - 2021-05-17T05:22:05+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ బాధితుల కోసం తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.20 లక్షల విలువ చేసే 15 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 10 ఆక్సిజన్‌ సిలిండర్స్‌ను అందించారు.

ఆక్సిజన్‌ సిలిండర్ల విరాళం
ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తున్న దృశ్యం

కర్నూలు(కలెక్టరేట్‌)/కల్లూరు, మే 16: జిల్లాలో కొవిడ్‌ బాధితుల కోసం తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.20 లక్షల విలువ చేసే 15 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 10 ఆక్సిజన్‌ సిలిండర్స్‌ను అందించారు. ఆదివారం కర్నూలులో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, జేసీ (సంక్షేమం) శ్రీనివాసులుకు గ్రీన్‌ కో సోలార్‌ కంపెనీ ఎండీ అనిల్‌, సంస్థ ప్రతినిధి శ్రీనివాసులు నాయుడు విరాళంగా అందించి అందజేశారు. గ్రీన్‌ కో పరిశ్రమ ఎండీ సంస్థ ప్రతినిధులను ఇన్‌చార్జి కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, జేసీ (సంక్షేమం) శ్రీనివాసులు అభినందించారు. పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. 


కరోనా బాధితులకు కొవిడ్‌ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో గ్రీన్‌కో సహకారంతో పాణ్యం ఎమ్మెల్యే 15 ఆటోమాటిక్‌ మిషన్లు, పది సిలిండర్లతో కూడిన వాహనాన్ని జెండాను ఊపి ప్రారంభించారు. అడిషనల్‌ జేసీ శ్రీనివాసులు, కాటసాని శివనరసింహారెడ్డి, కార్పొరేటర్‌ తానా శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T05:22:05+05:30 IST