Abn logo
Jul 24 2021 @ 22:43PM

అందుబాటులో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ప్రారంభిస్తున్న కలెక్టర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 24:  రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంటాయని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు. శనివారం సింగాపూర్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా సమకూర్చిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కలెక్టర్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటి వద్దనే ఆక్సిజన్‌ అందించే వెసలుబాటు కలుగుతుందని, ఆక్సిజన్‌ సిలిండర్లకు ఇవి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవడమే కాకుండా తేలికగా తీసుకెళ్ళడానికి వీలవుతుందన్నారు. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ కె. భాస్కర్‌రెడ్డి, ప్రతినిధులు చందూరి మహేందర్‌ పడాల రవీందర్‌, మధుసూదన్‌ రెడ్డి, నిర్వాహకులు, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

యువత సామాజిక సేవలో ముందుండాలి

ప్రకృతి విపత్తు సమయాలలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో యువత ముందుండా లని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు. రెడ్‌క్రాస్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను అందజేశారు. జూనియర్‌ రెడ్‌క్రాస్‌లో 53,595 మంది సభ్యత్వ నమోదు చేశామన్నారు. రాష్ట్ర గవర్నర్‌ నుంచి జారీ చేసిన డిగ్రీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను అందజేయడం సంతోషంగా ఉందాన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చక్రపాణి, డీఐఈఓ శైలజ, సెక్టోలర్‌ అధికారి సప్తర్‌ అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.