Abn logo
Jun 3 2021 @ 23:41PM

ఆక్సిజన్‌ బ్యాంకు ప్రారంభం

ప్రారంభిస్తున్న డాక్టర్‌ చంద్రశేఖర్‌

చిరంజీవి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహణ

కరీమాబాద్‌, జూన్‌ 3 : కరోనాబారిన పడి అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం ఉన్న వారు ఫోర్టురోడ్డులో నెలకొల్పిన ఆక్సిజన్‌ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని మెగా ఫ్యామిలీ ఫాన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్‌ కోరారు. గురువారం 39వ డివిజన్‌ ఫోర్టు రోడ్డు ఏకశిలనగర్‌లో కరాటే ప్రభాకర్‌ ఆధ్వర్యంలో గాయత్రి గ్రానైట్స్‌ అధినేత వద్దిరాజు రవిచంద్ర, వేములవాడ మున్నూరుకాపు సత్రం ట్రస్ట్‌ చైర్మన్‌ కొండా దేవయ్య సహకారంతో ఆక్సిజన్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు. కార్పొరేటర్‌ సిద్దం రాజు, వద్దిరాజు వెంకటేశ్వర్లు, కరాటే ప్రభాకర్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ ఈ ఆక్సిజన్‌ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా కరాటే ప్రభాకర్‌ మాట్లాడుతూ.. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ చిరంజీవి సూచనల మేరకు ఆక్సిజన్‌ బ్యాంకును నెలకొల్పి సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌ సిలిండ్‌ అవసరం ఉన్న వారు 98490-09993, 97042-42965, 98669-71651 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. వేణువంక కిరణ్‌, బెడిదె వీరన్న, బొక్క నిరంజన్‌, సాంబయ్య, గాదె మధుసూదన్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, రవి, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌, నవీన్‌, పవన్‌, తిరుమల్‌, రాజు, పృథ్విరాజ్‌ పాల్గొన్నారు.