ఆక్సిజన్‌ లేదంటూ ప్రైవేట్‌ ఆస్పత్రులు అడ్డగోలు వసూళ్లు

ABN , First Publish Date - 2021-05-14T14:26:59+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అత్యవసరంగా మారడంతో దీని కొరతను

ఆక్సిజన్‌ లేదంటూ ప్రైవేట్‌ ఆస్పత్రులు అడ్డగోలు వసూళ్లు

హైదరాబాద్/మెహిదీపట్నం : ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అత్యవసరంగా మారడంతో దీని కొరతను బూచిగా చూపిస్తూ కొన్ని ఆస్పత్రులు బాధితులు నుంచి అడ్డగోలు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. కొరత ఉందంటూ ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌ వరకు ఒక్కసారిగా ధరలు పెంచాయి. ఆక్సిజన్‌, సిలిండర్‌లదీ ఇదే పరిస్థితి. 800 - 1000 రూపాయిలు వరకు లభించే ఒక్కొక్క సిలిండర్‌ను ఐదు, పదివేలు చెప్పి బిల్లులు వేస్తున్నారు. ఒక్క సిలిండర్‌ రూ.50 నుంచి రూ.100 పెరిగితే ప్రైవేట్‌ ఆస్పత్రులు వేలల్లో పెంచుతున్నాయి. పలు ఆస్పత్రిల్లో ఆక్సిజన్‌ లేదంటూ అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ కరోనాను అడ్డపెట్టుకొని ఆక్సిజన్‌ కొరతను ఆసరాగా చేసుకొని దోచుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. మెహిదీపట్నం, నానల్‌నగర్‌, లంగర్‌హౌజ్‌, టోలిచౌకి, ఓయూ కాలనీ పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు అందిన కాడికి దోచుకుంటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సిలిండర్‌ రకాలు ... 

సామర్థ్యం (క్యూబిక్‌ మీటర్లులో)

ఎ - టైప్‌ - 1.0

బి - టైప్‌ - 1.5

సి - టైప్‌ - 3.5

బల్క్‌ - 7.0


ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలి.. 

ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలి. కరోనాతో ఆస్పత్రుల్లో చేరితే లక్షలు గుంజుతున్నారు. ప్రాణాలను కాపాడుకొనేందుకు నిరుపేద, మధ్యతరగతి వారు ఆస్తులను అమ్ముకుంటున్నారు. అయినా లాభం ఉండడం లేదు. మా రిలేషన్‌లో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. ఆక్సిజన్‌ పేరుతో ఆస్పత్రి నిర్వాహకులు దోచుకుంటున్నారు. - బోగె పరమేశ్‌కుమార్‌, హరిదాస్‌పురా, లంగర్‌హౌజ్‌.

Updated Date - 2021-05-14T14:26:59+05:30 IST