జిల్లా ఆస్పత్రిలో తీరిన ఆక్సిజన్‌ కొరత

ABN , First Publish Date - 2021-12-08T06:45:49+05:30 IST

భువనగిరిలోని జిల్లా ఆస్పత్రిలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతకు శాశ్వత పరిష్కారం లభించింది. కరోనా కాలంలో ఆక్సిజన్‌ కొరతతో మృతుల సంఖ్య పెరగడంతో నష్ట నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా పీఎంకేర్‌ ఫండ్‌ నుంచి జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ మంజూరైంది.

జిల్లా ఆస్పత్రిలో తీరిన ఆక్సిజన్‌ కొరత
ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌

 నిమిషానికి 500లీటర్లు ఉత్పత్తిచేసే సామర్థ్యం

భువనగిరిటౌన్‌, డిసెంబరు 7: భువనగిరిలోని జిల్లా ఆస్పత్రిలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతకు శాశ్వత పరిష్కారం లభించింది. కరోనా కాలంలో ఆక్సిజన్‌ కొరతతో మృతుల సంఖ్య పెరగడంతో నష్ట నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా పీఎంకేర్‌ ఫండ్‌ నుంచి జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ మంజూరైంది. ఈ పనులు పూర్తికాగా, నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తిచేసే సామర్థ్యంతో ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా ఆస్పత్రిలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతకు పరిష్కారం లభించింది. గాలి ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్‌ ప్రత్యేకత. జిల్లా ఆస్పత్రిలో 100 పడకలు ఉండగా, 25 పడకలకు ట్రిపుల్‌ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ మెడికల్‌ సర్వీసెస్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలె్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ ఎంఐఎ్‌సడీసీ) ఆధ్వర్యంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్‌ లైన్‌తో రోగులకు ఏక కాలంలో ఆక్సిజన్‌ అందడంతోపాటు వ్యాక్యూమ్‌ సెక్షన్‌, ఏయిర్‌ క్లీనింగ్‌ సేవలు అందుతాయి. మిగతా 75పడకలకు సింగిల్‌ లైన్‌ ద్వారా మెడికల్‌ ఆక్సిజన్‌ అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్‌ అందుబాటులోకి రావడంతో ఆక్సిజన్‌ కొనగోలు ఆర్థిక భారం ఆస్పత్రికి తప్పినట్టయిందని, అదేవిధంగా రోగులకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చిన్నా నాయక్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-08T06:45:49+05:30 IST