ఆక్సిజన్‌ కొరత రానివ్వం..

ABN , First Publish Date - 2021-05-11T13:57:23+05:30 IST

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత రానివ్వమని, రాష్ట్రవ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలి పారు. తిరువళ్లూర్‌ జిల్లా ఆవడిలోని కరోనా చికిత్సా

ఆక్సిజన్‌ కొరత రానివ్వం..

            - రాష్ట్రవ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఉత్పత్తి

            - మంత్రి ఎం.సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత రానివ్వమని, రాష్ట్రవ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. తిరువళ్లూర్‌ జిల్లా ఆవడిలోని కరోనా చికిత్సా కేంద్రా న్ని సోమవారం పరిశీలించిన మంత్రి మీడియాతో మాట్లా డుతూ, రాష్ట్రంలోని 10 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా వుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచార వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాసిన లేఖపై స్పందించిన కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన 419 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించిందని తెలిపారు. ఇది కాకుండా, తూత్తుకుడి స్టెరిలైట్‌ కర్మాగారం నుంచి మరికొన్ని రోజుల్లో 35 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందని, ఈ కారణం వల్ల ఇకపై రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. కరోనా పాజిటివ్‌ బాధితులకు చికిత్సలు అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్‌ అవసరమైతే ‘104’ అనే నెంబరును సంప్రదిస్తే వెంటనే సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెమ్‌డెసివర్‌ మందులకు కూడా కొరత లేకుండా రాష్ట్రంలోని మందుల ఉత్పత్తి సంస్థలు ఈనెల 21వ తేదీ నుంచి అదనంగా ఉత్పత్తులు చేపట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి వివరించారు.

Updated Date - 2021-05-11T13:57:23+05:30 IST