కొవిడ్‌ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా

ABN , First Publish Date - 2021-05-17T04:21:40+05:30 IST

కొవిడ్‌ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా

కొవిడ్‌ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా
ఎచ్చెర్ల: ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో కిశోర్‌

ఎచ్చెర్ల, మే 16: జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిశోర్‌ తెలిపారు. కుశాలపురం పంచాయతీ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత లేకుండా ఈ ప్లాంట్‌ నుంచి సరఫరా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో ప్రస్తుతం ఫీవర్‌ సర్వే జరుగుతుందన్నారు. ఎచ్చెర్ల మండలంలోని ఫీవర్‌ సర్వే వివరాలను తహసీల్దార్‌ సనపల సుధాసాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. 


ఫీవర్‌ సర్వే పరిశీలన

గార: మండలంలో చేపడుతున్న ఫీవర్‌ సర్వేను మండల ప్రత్యేక అధికారి గుత్తు రాజారావు ఆదివారం పరిశీలించారు. అంపోలు-3, శ్రీకూర్మం గ్రామ సచివాలయల పరిధిలో జరుగుతున్న ఈ సర్వేను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  పాలకొండ: సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పట్టణంలోకి వస్తున్న వారికి ఆక్సీమీటర్‌, థర్మల్‌ స్కానర్‌తో వైద్య సిబ్బంది పరీక్షించి జ్వర లక్షణాలు ఉన్నవారిని ఆసుప్రతికి తరలించాలని కమిషనర్‌ రామారావు తెలిపారు. ఆదివారం  పట్టణంలో ఇంటింటా నిర్వహించిన ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పంచాయతీలో కొవిడ్‌ కేసులు లేకుండా సిబ్బంది పనిచే యాలన్నారు. 21 మందికి జ్వరాలు ఉన్నట్టు గుర్తించి కొవిడ్‌ పరీక్షలు చేశామన్నారు.  ఫ అనవసరంగా బయటకు తిరగవద్దని డీఎస్పీ శ్రావణి సూచించారు. ఆదివారం పాలకొండలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ శంకరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌ పలు కూడళ్లలో కర్ఫ్యూ ను పరిశీలిం చారు. పలు వాహనాలను తనిఖీచేశా రు. అత్యవసర మైతేనే పట్టణంలోకి వెళ్లాలని ఆదేశించారు.


ఎచ్చెర్లలో 75  కేసులు

ఎచ్చెర్ల: మండలంలో ఆదివారం 75 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు తహసీ ల్దార్‌ సనపల సుధాసాగర్‌ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వీరందరికీ మెడికల్‌ కిట్లు పంపిణీ చేశామన్నారు. ఉన్నాయన్నారు. కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన అంబులెన్సల కోసం 9494206731, 9000115744 నంబర్లను సంప్రదించాలని సూచించారు. రణస్థలం: మండలంలో 68 కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు.


పొందూరులో 13..

పొందూరు: మండలంలో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీటీ షరీఫ్‌ తెలిపారు. జ్వరాల సర్వే పక్కాగా నిర్వహి స్తున్నామని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.


తప్పుడు సర్వేపై తహసీల్దార్‌ ఆరా

భామిని: నల్లరాయిగూడలో తప్పుడు జ్వరాల సర్వే నమోదుపై తహసీల్దార్‌ ఎస్‌. నరసింహమూర్తి ఆదివారం ఆరాతీశారు. వలంటీర్‌ ఆర్‌.రాజారావు  తమ పరిధిలో 50 ఇళ్లు ఉండగా 154 మందికి జ్వరాలు ఉన్నట్టు నమోదు చేశారు.దీంతో  కలెక్టర్‌ ఆదేశాల మేరకు నల్లరాయిగూడలో సమావేశం నిర్వహించి ఇంటింటా జ్వరాలపై ఆరా తీశారు. అయితే వలంటీర్‌ నల్లరాయిగూడ, రేగిడి, లక్ష్మీపురం గ్రామాల్లో సర్వే చేయగా జ్వరాలు లేవని కొట్టబోయి జ్వరాలు ఉన్నాయని పొరపాటున నమోదైందని తెలిపారు.   సమావేశంలో చర్చించి కలెక్టర్‌కు నివేదించినట్లు తహసీల్దార్‌ చెప్పారు.

 

Updated Date - 2021-05-17T04:21:40+05:30 IST