కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలం: ఒవైసీ

ABN , First Publish Date - 2021-08-01T09:23:40+05:30 IST

1 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ప్రజారోగ్య రక్షణకు

కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలం: ఒవైసీ

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ప్రజారోగ్య రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రజలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రతపై ఆయా రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ సీరో సర్వే (మే నెల) నివేదికను అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం ట్విటర్‌లో పోస్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయాన్ని పట్టించుకోకపోగా కనీసం కేసుల సంఖ్యను గణించడంలోనూ దృష్టి సారించలేదన్నారు. 

Updated Date - 2021-08-01T09:23:40+05:30 IST