హ్యుందాయ్ కారు గెలుచుకున్న ఓయో కస్టమర్

ABN , First Publish Date - 2021-10-06T21:46:15+05:30 IST

హ్యుందాయ్ కారు బహుమతిగా పొందడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇది అస్సలు ఊహించలేదు. కాల్ చేసి ఈ విషయం చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఒకసారి చూద్దామని వచ్చాను. చేతులోకి కారు తాళాలు తీసుకున్నాక పూర్తి నమ్మకం కలిగింది. ఓయోలో నాకు మంచి అనుభూతి ఉంది..

హ్యుందాయ్ కారు గెలుచుకున్న ఓయో కస్టమర్

న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ యాప్ ఓయో తన కస్టమర్‌కు హ్యుందాయ్ క్రెటా కార్‌ను బహుమతిగా అందించింది. తరుచూ ఓయో చెక్‌ఇన్స్‌లో ఉన్న అతడిని ఉత్తమ కస్టమర్ కింద ఎంపిక చేసిన ఓయో.. ఈ బహుమతిని అతడికి గుర్తుగా అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కారు గెలుచుకున్న వ్యక్తి పేరు రాజీవ్ హర్తిష్ (25). ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. తనకుండే పనుల వల్ల తరుచూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. అయితే అతడు ఓయో యాప్స్‌లో ఎక్కువ చెక్‌ఇన్స్ చేస్తుంటాడు. కాగా, రాజీవ్ హర్తిష్‌కు కారు బహుమానం అందించిన ఓయో కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘రాజీవ్ తరుచుగా ఎక్కడెక్కిడో ట్రావెల్ చేస్తుంటాడు. ఇక నుంచి డ్రైవింగ్‌ను కూడా ఎంజాయ్ చేస్తాడు’’ అని చెప్పుకొచ్చారు.


కాగా, కారు పొందిన ఆనందంలో రాహుల్ స్పందిస్తూ ‘‘హ్యుందాయ్ కారు బహుమతిగా పొందడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇది అస్సలు ఊహించలేదు. కాల్ చేసి ఈ విషయం చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఒకసారి చూద్దామని వచ్చాను. చేతులోకి కారు తాళాలు తీసుకున్నాక పూర్తి నమ్మకం కలిగింది. ఓయోలో నాకు మంచి అనుభూతి ఉంది. మంచి స్టాఫ్, వ్యాక్సినేటెడ్ హోటల్స్, అన్నింటికి మించి నమ్మకం. ఇప్పుడు ఓయోని మరింతగా ప్రేమిస్తున్నాను’’ అని అన్నాడు.

Updated Date - 2021-10-06T21:46:15+05:30 IST