అవకాశం వస్తే కెప్టెన్‌గా చేస్తా

ABN , First Publish Date - 2022-01-18T10:15:29+05:30 IST

భారత జట్టు కెప్టెన్‌గా ఉండేందుకు తాను సిద్ధమేనని పేసర్‌ బుమ్రా తెలిపాడు.

అవకాశం వస్తే కెప్టెన్‌గా చేస్తా

పార్ల్‌: భారత జట్టు కెప్టెన్‌గా ఉండేందుకు తాను సిద్ధమేనని పేసర్‌ బుమ్రా తెలిపాడు. ప్రస్తుతం బుమ్రా వన్డే జట్టు వైస్‌కెప్టెన్‌గా తాత్కాలిక బాధ్యతలు తీసుకున్నాడు. ఇక టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలగడంతో తర్వాత సారథి విషయంలో రాహుల్‌, రోహిత్‌, పంత్‌ పేర్లు వినిపించగా తాజాగా బుమ్రా కూడా ఈ బాధ్యతపై ఆసక్తి ప్రదర్శించాడు. ‘ఒకవేళ నన్ను కెప్టెన్‌గా నియమిస్తే అది నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. వాస్తవానికి ఈ అవకాశాన్ని ఏ ఆటగాడైనా వదులుకుంటాడని అనుకోను. ఇక ఎవరి ఆధ్వర్యంలో పనిచేసినా నా శాయశక్తులా జట్టు కోసం కృషి చేస్తా’ అని బుమ్రా స్పష్టం చేశాడు. కపిల్‌ దేవ్‌ మినహా ఇప్పటివరకు మరో పేసర్‌ భారత జట్టుకు నాయకత్వం వహించలేదు. అలాగే మూడో టెస్టు ముగిశాక టీమ్‌ సమావేశంలో కోహ్లీ తన నిర్ణయాన్ని తెలిపాడని బుమ్రా వెల్లడించాడు. నాయకుడిగా జట్టుకు అందించిన విజయాలపై తామంతా అతడిని అభినందించామన్నాడు. 

Updated Date - 2022-01-18T10:15:29+05:30 IST